Chinthakani: చింతకానిలో సోషల్ మీడియా వేధింపుల నిందితుడి అరెస్ట్

Chinthakani: చింతకాని పీఎస్ పరిధిలో సోషల్ మీడియాలో మహిళలను వేధించిన నిందితుడి అరెస్ట్. ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. పోలీసుల కఠిన హెచ్చరిక.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 8 Nov 2026 10:50 PM IST
Chinthakani
X

Chinthakani: చింతకానిలో సోషల్ మీడియా వేధింపుల నిందితుడి అరెస్ట్

చింతకాని: పోలీస్ స్టేషన్ పరిధిలో క్రైమ్ నం. 246/2026 కేసులో నిందితుడిని అరెస్టు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చింతకాని పోలీసులు ప్రజలకు తెలియజేయునది ఏమనగా, సోషల్ మీడియా వేదికలైన వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ తదితర మాధ్యమాల ద్వారా మైనర్ బాలికలు మరియు మహిళల పట్ల అసభ్యకరమైన, అభ్యంతరకరమైన పోస్టులు, వ్యాఖ్యలు చేయడం, ఫోటోలు లేదా వీడియోలను దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడితే అటువంటి వారిపై IT Act మరియు ఇతర చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

అలాగే, ఎవరైనా సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురైనట్లయితే భయపడకుండా ధైర్యంగా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరడమైనది. బాధితుల వివరాలను గోప్యంగా ఉంచుతూ, చట్టప్రకారం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.