Kalluru: కల్లూరులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
Kalluru: ఖమ్మం జిల్లా కల్లూరులో మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిపారు.
Kalluru: కల్లూరులో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
Kalluru: తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఖమ్మం జిల్లా కల్లూరులో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంగా జరిగాయి.
ఈ కార్యక్రమంలో కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్ నాయక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అర్జున్ రావు, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉస్మాన్, స్థానిక కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.




