Bhadrachalam: భద్రాచలం: సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే తెల్లం

Bhadrachalam: భద్రాచలం క్యాంపు కార్యాలయంలో దుమ్ముగూడెం మండలానికి చెందిన బాధితుడికి రూ.28 వేల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు అందజేశారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem
Published on: 21 Sept 2026 6:18 PM IST
Bhadrachalam
X

Bhadrachalam: భద్రాచలం: సీఎంఆర్‌ఎఫ్ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే తెల్లం

భద్రాచలం: ఆపదలో ఉన్న నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసా అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నామని భద్రాచలం నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు తెలిపారు.

భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దుమ్ముగూడెం మండలం ప్రగల్లపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి నాగరాజుకు రూ.28,000/- విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే గారు అందజేశారు.

ఈ సందర్భంగా లబ్ధిదారుడి కుటుంబంతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకున్న ఎమ్మెల్యే గారు, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం వారికి కొంతైనా ఊరట కలిగిస్తుందని, కష్టకాలంలో ప్రజలకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఒక భరోసాగా నిలుస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా సహాయం అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే గారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భద్రాచలం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పూనెం కృష్ణ గారు, పార్టీ నాయకులు రత్నం రమాకాంత్ , నర్రా రాము, ఎండి జిందా, చేగోండి శ్రీనివాస్, సుజాత, కంప్యూటర్ ఆపరేటర్ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Ch. Laxmikanth,  Bhadradri Kothagudem

Ch. Laxmikanth, Bhadradri Kothagudem