Sujathanagar: రాఘవపురంలో భూ రీ సర్వే పనుల పరిశీలన!

Sujathanagar: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవపురంలో భూ రీ సర్వే పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్. పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 7 Nov 2026 12:23 PM IST
Sujathanagar
X

Sujathanagar: రాఘవపురంలో భూ రీ సర్వే పనుల పరిశీలన!

Sujathanagar: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సుజాతనగర్ మండలం రాఘవపురం గ్రామంలో కొనసాగుతున్న భూ రీ సర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో ఇప్పటివరకు పూర్తయిన సర్వే పనులతో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రక్రియపై సంబంధిత రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ రాఘవపురం గ్రామ పరిధిలో మొత్తం 1,800 ఎకరాల ఒక కుంట విస్తీర్ణంలో భూ రీ సర్వే చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే గ్రామ సరిహద్దులు, గ్రామకంఠం, ప్రభుత్వ భూములు, రహదారులకు సంబంధించిన సర్వే పూర్తి చేసి హద్దులు నిర్ణయించినట్లు వివరించారు. మిగిలిన భూములకు సంబంధించి ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు.

అనంతరం కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ భూ రీ సర్వే ప్రక్రియను అత్యంత జాగ్రత్తగా, పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి భూమికి సంబంధించిన వివరాలు, హద్దులను క్షుణ్ణంగా పరిశీలించి కచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములు, గ్రామకంఠం, రహదారుల హద్దుల విషయంలో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా రికార్డుల ఆధారంగా సర్వే చేపట్టాలని స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించాలని, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ కృష్ణప్రసాద్, సర్వేయర్ కిరణ్ కుమార్, సంబంధిత రెవెన్యూ, సర్వే సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM