Kothagudem: భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ అంకిత్ స్పెషల్ ఫోకస్
Kothagudem: జిల్లాలో భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి కలెక్టర్ అంకిత్ ఆదేశాలు.
Kothagudem: భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ అంకిత్ స్పెషల్ ఫోకస్
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో భూభారతి, సాదా బైనామా, ఇతర భూసేకరణకు సంబంధించిన పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం ఐ డి ఓ సి కార్యాలయం కలెక్టర్ ఛాంబర్‌లో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తో కలసి అశ్వాపురం, మణుగూరు, పినపాక, అశ్వారావుపేట, దమ్మపేట, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి మండలాల తహసీల్దార్లు, ఆర్‌ఐలు, సర్వేయర్లు సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మండలాల వారీగా భూభారతి దరఖాస్తులు, సాదా బైనామా కేసులు, భూసేకరణ అంశాల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. భూ సమస్యల పరిష్కారంలో జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
భూభారతి, సాదా బైనామా దరఖాస్తుల పరిశీలనలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన న్యా భద్రాద్రి కొత్తగూడెం యం జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల సంఖ్యను తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని సూచించారు. మ్యూటేషన్లు, వారసత్వ హక్కుల నమోదు, ఇతర రెవెన్యూ సేవలకు సంబంధించిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు.
అభివృద్ధి పనులకు సంబంధించిన భూసేకరణ అంశాలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని, పరిహారం చెల్లింపులు, భూ స్వాధీనం ప్రక్రియలో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని అన్నారు.
ఈ సమావేశంలో సంబంధిత తహసీల్దార్లు, గిర్దావర్లు, సర్వేయర్లు, కలెక్టరేట్‌కు చెందిన సంబంధిత శాఖల సూపరింటెండెంట్లు పాల్గొని మండలాల వారీగా వివరాలను జిల్లా కలెక్టర్‌కు నివేదించారు. వివిధ భూ సంబంధిత అంశాలపై చర్చించి అవసరమైన సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.




