Julurupadu: జూలూరుపాడులో జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ!
Julurupadu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ జూలూరుపాడులో ఆకస్మిక తనిఖీ.
Julurupadu: జూలూరుపాడులో జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ!
జూలూరుపాడు: రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. జూలూరుపాడు మండలంలో ప్రభుత్వం ఏర్పాటుచేసిన ధాన్యం మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
గత రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్నల తడిసాయ అని సొసైటీ సిబ్బందిని ఆరాతీశారు. ఇప్పటివరకు ఎంత మేరా ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేశారని, ఇంకా ఎంత కేంద్రంలో నిల్వ ఉన్నదని, అదేవిధంగా మొక్కజొన్నలు కొనుగోలు చేసేందుకు సరిపడా బ్యాగులు ఉన్నాయా లేవా అని సొసైటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన మొక్కజొన్న, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు.
సులూరుపాడులోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ అంకిత్ సందర్శించారు. బుధవారం రాత్రి కురిసిన అకాల వర్షానికి మొక్కజొన్నల తడిసాయ అని సొసైటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు ఎంత మేరా మొక్కజొన్నలు కొనుగోలు చేశారని, ఇంకా ఎంత కేంద్రంలో నిల్వ ఉన్నదని సొసైటీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తడిసిన మొక్కజొన్న, ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీనివాస్, ఎంపీడీవో రవి, ఎంపీఓ తులసీరామ్ తదితరులు పాల్గొన్నారు.




