Chintoor: కూనవరంలో వరద పునరుద్ధరణ పనులపై కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష

Chintoor: అల్లూరి జిల్లా చింతూరు, కూనవరంలలో వరద పునరుద్ధరణ పనులపై కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష. శానిటేషన్, మంచినీటి సరఫరా, వైద్య సేవలను వేగవంతం చేయాలని ఆదేశం.

RAJESH REDDY, CHINTOOR
Published on: 3 Aug 2026 2:00 PM IST
Chintoor
X

Chintoor: కూనవరంలో వరద పునరుద్ధరణ పనులపై కలెక్టర్ దినేష్ కుమార్ సమీక్ష

పోలవరం జిల్లా - చింతూరు

వరద పునరుద్ధరణ పనులు వేగవంతం

పునరుద్ధరణ పనుల పై అధికారులతో కలెక్టర్ సమీక్ష

కూనవరం : గోదావరి శబరి నదులు సృష్టించిన వరద బీభత్సానికి విలీన మండలాల ప్రజల జీవనం అస్తవ్యస్తంగా తయారైంది. వరద వలన ముంపునకు గురైన గ్రామాలలో బాధితుల ఆవేదన వర్ణనాతీతం. ముంపు ప్రాంతాలలో చేపట్టవలసిన అత్యవసర పనుల పై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులతో కూనవరం తాసిల్దార్ కార్యాలయంలో సమీక్ష ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాలలో ప్రధానంగా శానిటేషన్, మంచినీటి సరఫరా, వైద్య సేవలు, రహదారుల శుభ్రత వంటి వాటి పై విస్తృతంగా పనులు వేగవంతం చేయాలని సూచించారు. బాధితులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పునరుద్ధరణ పనుల కై ప్రత్యేకంగా నియమించిన అధికారులు చర్యలు ముమ్మరం చేయాలని తెలిపారు. వరద ప్రాంతాలలో పునరుద్దరణ పనుల పై ఏ అధికారి నిర్లక్ష్యం వహించిన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR

Next Story