Khammam: సైబర్ మోసాలకు చెక్ పెట్టండి అవగాహన పోస్టర్లు విడుదల!

Khammam: ఖమ్మం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో పాజ్ ఫర్ సేఫ్టీ థింక్ వెరిఫై నినాదంతో సైబర్ భద్రత అవగాహన పోస్టర్లను ప్రారంభించిన సీపీ సునీల్ దత్.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 8 Oct 2026 12:42 PM IST
Khammam
X

Khammam: సైబర్ మోసాలకు చెక్ పెట్టండి అవగాహన పోస్టర్లు విడుదల!

Khammam: జాతీయ సైబర్‌ సెక్యూరిటీ అవగాహన కార్యక్రమాలలో భాగంగా భారత ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు తెలంగాణ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో ప్రజలకు సైబర్‌ భద్రతపై విస్తృత అవగాహన కల్పించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అక్టోబర్‌ మాసంలో నిర్వహిస్తున్న “పాజ్ ఫర్ సేఫ్టీ – థింక్ - వెరిఫై…” అనే నినాదంతో రూపొందించిన పోస్టర్లను పోలీస్ కమిషనర్ కార్యాలయంలో బుధవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రారభించారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరాలు వివిధ రూపాల్లో జరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించడం ద్వారా అనేక మోసాలను ముందుగానే నివారించవచ్చని తెలిపారు.

తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్‌ కాల్స్‌, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్‌, సోషల్‌ మీడియా లింక్‌లను తొందరపడి నమ్మవద్దని సూచించారు. OTP, PIN, CVV, పాస్‌వర్డ్‌లు, బ్యాంక్‌ ఖాతా వివరాలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు.

ఏదైనా అనుమానాస్పద లింక్‌ లేదా మెసేజ్‌ వచ్చినప్పుడు వెంటనే స్పందించకుండా “Pause – Think –Verify”(“ఆగండి – ఆలోచించండి – ధృవీకరించండి… సైబర్‌ మోసాలకు చెక్‌ పెట్టండి)సూత్రాన్ని పాటించాలని సూచించారు. పెట్టుబడులు, ఉద్యోగాలు, రుణాలు, బహుమతులు, డిజిటల్‌ అరెస్టులు, KYC అప్‌డేట్‌ తదితర పేర్లతో జరిగే మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

సైబర్‌ మోసానికి గురైనట్లయితే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 సైబర్‌ క్రైమ్‌ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని, అలాగే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని పోలీస్ కమిషనర్ సూచించారు.

“తొందరపాటు నిర్ణయం సైబర్‌ మోసానికి దారితీయవచ్చు.. ఒక్కసారి ఆగి ఆలోచించి, ధృవీకరించిన తర్వాతే స్పందించండి” అనే సందేశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు అక్టోబర్‌ నెలంతా పాఠశాలలు, కళాశాలలు,మార్కెట్లు,అపార్ట్‌మెంట్‌,సంఘాలు, రవాణా కేంద్రాలు, ప్రజలు అధికంగా రాకపోకలు సాగించే ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు. కార్యక్రమంలో సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ ఫణిందర్, సిబ్బంది పాల్గొన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.