Kothagudem: గోదావరి పుష్కరాల పనులు సకాలంలో పూర్తి చేయాలి..శైలజా రామయ్యర్!
Kothagudem: కొత్తగూడెం జిల్లాలో గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులను గడువులోగా, నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఆదేశించారు.
Kothagudem: గోదావరి పుష్కరాల పనులు సకాలంలో పూర్తి చేయాలి..శైలజా రామయ్యర్!
Kothagudem: రానున్న గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన అభివృద్ధి పనులన్నింటినీ నిర్ణీత గడువులోగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు.
శనివారం రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో కలిసి పలు జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షించారు. ఐడీఓసీ కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ అంకిత్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శైలజా రామయ్యర్ మాట్లాడుతూ నూతన పుష్కర ఘాట్ల నిర్మాణం, ఇప్పటికే ఉన్న ఘాట్ల మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయాల పనులను వేగవంతం చేయాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు.
పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షిత తాగునీటి సరఫరా, ఆకర్షణీయమైన లైటింగ్, మెరుగైన పారిశుద్ధ్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఘాట్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
అభివృద్ధి పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసి పనులకు ఆటంకాలు లేకుండా చూడాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పుష్కరాల ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఈఓ దామోదర్ రావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.




