Palwancha: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది

Palwancha: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని పాల్వంచ సొసైటీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు శుక్రవారం పాల్వంచలో పేర్కొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 27 Nov 2026 8:20 PM IST
Palwancha
X

Palwancha: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది

పాల్వంచ: తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని పాల్వంచ సొసైటీ చైర్మన్, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియలో భాగంగా శుక్రవారం పాల్వంచ పట్టణంలోని పాత పాల్వంచ 46వ డివిజన్‌లో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవితో కలిసి ఆయన నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నమోదు ప్రక్రియను పరిశీలించారు.

అనంతరం కొత్వాల మాట్లాడుతూ బలహీన వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు తమ మద్దతు కొనసాగించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి, వార్డు ఆఫీసర్ దామెర్ల నరేష్, ఏఈ నవీన్, వివిధ డివిజన్ల వార్డు ఆఫీసర్లు సందీప్, నరేష్, ప్రశాంత్, రవీందర్, వరుణ్, ఆర్పీలు అరుణ, నాగమణి, పుష్ప, కాంగ్రెస్ నాయకులు ఎస్.ఖాజామియా, కరీం, బొందిల శేషగిరి, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN