Kothagudem: మంత్రి పొంగులేటిపై బురదజల్లే ప్రయత్నం కాంగ్రెస్ నేత తోట దేవి ప్రసన్న!
Kothagudem: ఆళ్ల మురళి వ్యాపార వ్యవహారంతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న స్పష్టం చేశారు.
Kothagudem: మంత్రి పొంగులేటిపై బురదజల్లే ప్రయత్నం కాంగ్రెస్ నేత తోట దేవి ప్రసన్న!
Kothagudem: మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రతిపక్షాలు ఆయనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తోందని, తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్ట ప్రకారం చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆళ్ల మురళికి సంబంధించిన వ్యవహారం ఆయన వ్యక్తిగత వ్యాపార అంశమని, దీనికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లులపై టాస్క్‌ఫోర్స్ అధికారులు నిష్పక్షపాతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే సంబంధిత మిల్లుపై దాడులు జరిగాయని తెలిపారు.
తప్పు చేసిన వారు తనకు ఎంతటి ఆప్తులైనా మంత్రి పొంగులేటి ఉపేక్షించరని అన్నారు. అధికారులపై మంత్రి రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నారనే ప్రచారంలో వాస్తవం లేదని ఖండించారు. మంత్రి పుట్టినరోజు రోజే సంబంధిత మిల్లుపై టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించి కేసు నమోదు చేయడం ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయస్థానం పరిధిలో ఉందని, కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్షసాధింపు చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదని, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని వివరించారు. రాజకీయ విమర్శల పేరుతో అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని తోట దేవి ప్రసన్న ప్రతిపక్షాలకు సూచించారు.




