Palvancha: మోదీ నిరంకుశ పాలనకు ఈ అరెస్టులే నిదర్శనం: కొత్వాల!
Palvancha: రాహుల్ గాంధీ మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్రమ అరెస్టులను నిరసిస్తూ పాల్వంచలో కాంగ్రెస్ నాయకుడు కొత్వాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
Palvancha: మోదీ నిరంకుశ పాలనకు ఈ అరెస్టులే నిదర్శనం: కొత్వాల!
పాల్వంచ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని రక్తం కారేలా గాయపరిచి, అక్రమంగా అరెస్టు చేయించడం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ నిరంకుశత్వ పాలనకు నిదర్శనమని డి.సి.ఎం.ఎస్ మాజీ చైర్మన్, రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ డైరెక్టర్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు* అన్నారు.
తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజాస్వామ్యబద్దంగా ఢిల్లీలో ఆందోళన చేస్తున్న నీట్ట్స్ విద్యార్థులను అక్రమంగా లాఠీచార్జ్ జరిపి, అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ అఖిల భారత కాంగ్రెస్ అగ్రనేత, పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీని, ఏ.ఐ.సి.సి అధ్యక్షులు ఖర్గే, ఎం.పీ ప్రియాంక గాంధీ లను రక్తం వచ్చేలాగా గాయపరచి అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వారి అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఆందోళన చేసిన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పి.సి.సి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నాల ప్రభాకర్, అజారుద్దీన్ లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కొత్వాల నాయకత్వంలో భారీ ప్రదర్శన రాస్తారోకో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేసినందుకు బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పక్షాన అండగా నిలిచి న్యాయం చేయాలని ఆందోళన చేసిన రాహుల్ గాంధీ పై పోలీసులు బల ప్రయోగానికి దిగడం సిగ్గుచేటు అన్నారు. అరెస్టులకు, అక్రమ కేసులకు కాంగ్రెస్ శ్రేణులు భయపడేది లేదని విద్యార్థుల ఆందోళనకు రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని కొత్వాల అన్నారు. 2028 లో జరిగే ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయం అని కొత్వాల అన్నారు.




