Ashwapuram: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి!
Ashwapuram: సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినంగా ప్రకటించాలి.. సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని డిమాండ్ చేసిన సీపీఐ నేత కమటం వెంకటేశ్వరావు.
Ashwapuram: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి!
Ashwapuram: సెప్టెంబర్ 17ను తెలంగాణ విలీన దినోత్సవంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు.
అశ్వపురం ఏఐటీయూసీ కార్యాలయంలో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సభ మేలపుర సురేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం కు ముఖ్య అతిథిగా కమటం వెంకటేశ్వరావు హాజరై మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి, ఆ పోరాటంలో కీలక పాత్ర పోషించిన కమ్యూనిస్టుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలని కోరారు.
తెలంగాణలో భూస్వామ్య, నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగిన రైతాంగ పోరాటం ఫలితంగా లక్షలాది ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనత సీపీఐకి ఉందన్నారు. వేలాది మంది రైతులు, కార్మికులు, ప్రజలు పోరాటంలో పాల్గొని త్యాగాలు చేశారని పేర్కొన్నారు.
చారిత్రక వాస్తవాలను పక్కనపెట్టి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్రను వక్రీకరించడం సిగ్గుమాలిన చర్య అని కమటం వెంకటేశ్వరావు విమర్శించారు. నిజమైన చరిత్రను ప్రజలకు, ముఖ్యంగా యువతకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. 1947 ఆగస్టు 15 దేశానికి స్వాతంత్రం వచ్చిన తెలంగాణ నిజాం నవాబు నిరంకుశ పాలనకు దేశముక్కులు భూస్వాములు ఈ ప్రాంత ప్రజలను పీడిస్తూ వెట్టి చాకిరి బానిసత్వం కొనసాగిస్తూ మహిళలను అత్యాచారాలు చేస్తూ దమన కాండా నిర్వహించారు.
దీనికి వ్యతిరేకంగా ఆనాడు దొడ్డి కొమరయ్య, మోహిం మోహినుద్దీన్, బద్దం ఎల్లారెడ్డి, నాయకత్వాన ఆనాడు చాకలి ఐలమ్మ ,మల్లు స్వరాజ్యం ,చంద్ర రాజేశ్వరరావు ఇలా అనేకమంది నాయకత్వంలో వేలాదిమంది కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సాహితులై నిజాం నవాబుకు వ్యతిరేకంగా పోరాటం చేసి సుమారు 5000 మంది ప్రాణత్యాగం చేశారని సెప్టెంబర్ 11 నుండి 17 వరకు జరిగిన పోరాటంలో వేలాదిమంది కమ్యూనిస్టు పార్టీ నాయకులు చనిపోయారని , 1948 సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన జరిగిందని , కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో సుమారు 24 లక్షల ఎకరాల భూ పంపిణీ జరిగిందని, దేశంలోనే పెద్ద పోరాటం తెలంగాణ సాయుధ పోరాటమేనని దీనిని పాఠ్యాంశాలలో చేర్చాలని భవిష్యత్ తరాలకు అందించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ పోరాటం భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం, సమానత్వం కోసం జరిగిందన్నారు. కానీ కొందరు రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం మత రాజకీయం సృష్టిస్తున్నారని ఇది సరైన విధానం కాదని వారన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గుర్తించి సెప్టెంబర్ 17న విమోచన దినంగా ప్రకటించి తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు.
*ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి అనంతనేని సురేష్ ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వేర్పుల మల్లిఖార్జున్ ఏఐటీయూసీ మండల అద్యక్షుడు రాయపూడి రాజేష్ సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు ఏడేళ్ళి కమలాకర్ జక్కుల రామచందర్ కొత్తపల్లి సత్యనారాయణ aisf నాయకులు అక్కినపల్లి నాగేంద్ర aiyf నాయకులు రెడ్డిబోయిన వెంకన్న బండ్ల వేంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.




