Julurupadu: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీ దోపిడీ.. రైతుల కోసం సీపీఐ సంచలన డిమాండ్!
Julurupadu: జూలూరుపాడులో సీపీఐ మండల కౌన్సిల్ సమావేశం.
Julurupadu: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో భారీ దోపిడీ.. రైతుల కోసం సీపీఐ సంచలన డిమాండ్!
జూలూరుపాడు : ధాన్యం క్వింటాకు ఐదు కిలోల తరుగు తీయడం రైతులను నిలువు దోపిడీ చేయడమేనని, దీనిని వెంటనే నిలిపివేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక ఆర్కే ఫంక్షన్ హాల్ లో మండల కౌన్సిల్ సమావేశం వల మల్ల సామేలు అధ్యక్షతన జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి సాబీర్ పాషా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను అమ్ముకోవడానికి వస్తే, తరుగు పేరుతో అడ్డగోలుగా కోత విధిస్తూ అన్నదాతలను మోసం చేయడం అన్యాయమన్నారు. ఇప్పటివరకు కోత పెట్టిన ధాన్యం విలువను లెక్కకట్టి ఆ సొమ్మును తక్షణమే రైతుల ఖాతాల్లో జమ చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. తరుగుపేరుతో రైతులకు జరుగుతున్న అన్యాయంపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు సరిపడా టార్పాలిన్లు, గిడ్డంగి సౌకర్యం, తాగునీరు, ఎండ తగలకుండా నీడ వంటి కనీస వసతులు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా ధాన్యం సేకరించాలని, నిబంధనలు అతిక్రమిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు సామాన్య ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం కొనసాగిందని దేశ సంపదను కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ దేశాన్ని దోచుకుంటున్నారని విమర్శించారు ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చండ్ర నరేంద్ర కుమార్ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు, సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, ఎల్లంకి మధు, యాస రోశయ్య తూముకోటయ్య పోనేకంటి వెంకటేశ్వర్లు, కంచర్ల రాఘవేంద్రరావు సిరిపురపు వెంకటేశ్వర్లు కొండ వీరయ్య చిమట ముత్తయ్య, పాలెపు ప్రభాకర్, ఊ డల సుధా, బరగడ రమేష్ పత్తిపాటి మహేష్ ఉదారి నాగయ్య , చల్లగొండ్ల సతీష్ చీమకుర్తి సంతోష్ యరాదశి రామారావు తదితరులు పాల్గొన్నారు.




