Kothagudem: మార్పు కోసమే ఢిల్లీ పోరుయాత్ర: సీపీఐ నేత సాబీర్ పాషా!

Kothagudem: దేశంలో మార్పు కోసమే ఢిల్లీ పోరుయాత్ర చేపడుతున్నామని సీపీఐ భద్రాద్రి జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా తెలిపారు. జిల్లా నుంచి 500 మంది ఢిల్లీకి తరలివెళ్లారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 30 Aug 2026 11:50 PM IST
Kothagudem
X

Kothagudem: మార్పు కోసమే ఢిల్లీ పోరుయాత్ర: సీపీఐ నేత సాబీర్ పాషా!

కొత్తగూడెం, ఆగస్టు 30: దేశంలో మార్పు కోసం ఢిల్లీ వేదికగా భారీ పోరాట యాత్ర, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఎస్‌.కె. సాబీర్ పాషా తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా నుంచి సుమారు 500 మంది కార్మికులు, రైతులు, విద్యార్థులు, మహిళలు ఢిల్లీకి తరలివెళ్తున్నారని చెప్పారు.

ఢిల్లీకి తరలివెళ్తున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత నెల రోజులుగా జిల్లాలోని గ్రామాలు, బస్తీల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. ఈ నెల 6 నుంచి 14 వరకు నిర్వహించిన జనచైతన్య యాత్రల ద్వారా ప్రజల్లో అవగాహన, చైతన్యం పెంపొందించామని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతులు, కార్మికులు, విద్యార్థులు, మహిళలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఢిల్లీలో జరిగే పోరాటంలో జిల్లా ప్రతినిధులు క్రియాశీలకంగా పాల్గొంటారని, అక్కడ తీసుకునే నిర్ణయాల అమలుకు భవిష్యత్తులో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని సాబీర్ పాషా స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మేయర్ మూడ్ గణేష్, జిల్లా నాయకులు సరెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి, ఉప్పుశెట్టి రాహుల్, కంచర్ల జమలయ్య, మువ్వా వెంకటేశ్వరరావు, డి. సుధాకర్, రాజబాబు, సర్పంచులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story