Kothagudem: కొత్తగూడెంలో గాడితప్పిన మున్సిపల్ పాలన.. ఆందోళన హెచ్చరిక

Kothagudem: కొత్తగూడెం పరిధిలోని ప్రధాన కూడళ్లలో పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని, దెబ్బతిన్న రోడ్లను బాగుచేయాలని డిమాండ్ చేస్తూ వినతిపత్రం సమర్పించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 22 Jun 2026 6:38 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెంలో గాడితప్పిన మున్సిపల్ పాలన.. ఆందోళన హెచ్చరిక

Kothagudem: ఈరోజు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలో ఉన్న పబ్లిక్ టాయిలెట్స్ ను నిర్మించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా నాయకులు జాటోజ్ కృష్ణ. కొత్తగూడెం పట్టణ కార్యదర్శి పెద్ద బోయిన సతీష్ మాట్లాడుతూ..

కొత్తగూడెం కార్పొరేషన్ గా ఏర్పడినా సమస్యలు అలానే ఉన్నాయని విమర్శించారు. ప్రధానంగా కొత్తగూడెం పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి బస్టాండ్ సెంటర్, రైల్వే స్టేషన్,పోస్ట్ ఆఫీస్ ఏరియా,రామవరం, సుజాతనగర్ తదితర ముఖ్యమైన పట్టణ ప్రాంతాల్లో నిత్యం వేలాది మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం పట్టణంలోకి వస్తుంటారని, వారికి పబ్లిక్ టాయిలెట్స్ లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారని,

ముఖ్యంగా మహిళలు చాలా ఇబ్బందులకు గురవుతున్నట్లు వివరించారు.. కార్పొరేషన్ ఏర్పడినప్పటికీ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారని, నిర్మించినటువంటి పబ్లిక్ టాయిలెట్స్ మూతపడ్డాయని, అవసరమైన చోట్ల కట్టియకుండా చోద్యం చూస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని విమర్శించారు.

అలాగే కార్పొరేషన్ పరిధిలో మంచినీటి సౌకర్యం పేరుతో రోడ్లను వేస్తున్నారని, అయితే రోజుల తరబడి పైపులైన్లు వేస్తూ, గుంటలను పూడ్చకుండా, సరిగా మట్టిని తీసేయకుండా ఉండటం మూలాన దుమ్ము ధూళితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అయినా పట్టించుకునే పరిస్థితి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కార్పొరేషన్ సభస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేసారు. లేనియెడల రాబోయే రోజుల్లో ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. తక్షణమే కలెక్టర్ స్పందించి వీలైనంత తొందరగా పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన వారిలో పట్టణ నాయకులు ఎం రాజశేఖర్, చంద్రశేఖర్.,జ్యోతి,దివ్య. కుమార్ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story