Julurpadu: ఎన్డీఏపై పోరుకు ఆగస్టు 11న జూలూరుపాడులో 'ప్రజా చైతన్య యాత్ర'
Julurpadu: కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కొత్తగూడెం జిల్లా సీపీఐ ఆధ్వర్యంలో చేపట్టిన 'ప్రజా చైతన్య యాత్ర' .
Julurpadu: ఎన్డీఏపై పోరుకు ఆగస్టు 11న జూలూరుపాడులో 'ప్రజా చైతన్య యాత్ర'
Julurpadu: దేశంలో బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాల వల్ల సామాన్య ప్రజల జీవితం దుబ్బరంగా మారింది నిత్యవసర వస్తువుల ధరలు పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిరంతరం పెరగటంతో ప్రజలపై ఆర్థిక భారం రోజురోజుకు పెరుగుతావుంది కార్మికుల హక్కుల కాలరాస్తూ కార్మిక చట్టాల బలహీనపరచటం రైతుల గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని సీపీఐ మండల కార్యదర్శి గుండె పిన్ని వెంకటేశ్వర్లు విమర్శించారు .
ఆదివారం జూలూరుపాడులో వాల్పోస్టర్ను ఆవిష్కరించారు అనంతరం వారు మాట్లాడుతూ విద్య వైద్యం వంటిమౌలిక రంగాలు కూడా కార్పొరేట్ శక్తులకు అప్పగించే ప్రయత్నాలు సాగుతున్నాయి మహిళలు దళితులు ఆదివాసులపై జరుగుతున్న దాడులు వివక్షత అణిచివేతలు పెరగడంతో దేశ ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా మారింది .
పెండింగ్లో ఉన్నప్పుడు పట్టాలు తక్షణమే జారీ చేయాలి సీతారామ ప్రాజెక్టు ద్వారా మండల ప్రజలుకు సాగునీరు అందించాలి, ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని లౌకిక విలువలను కాపాడేందుకు ప్రజల హక్కులను సాధించేందుకు ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో ఆగస్టు ఆరు నుంచి 14 వరకు ఈ ప్రజా చైతన్య యాత్రల జరుగుతున్నాయని ఈనెల 11వ తేదీన జూలూరుపాడు మండలానికి రానున్న ప్రజా చైతన్య యాత్ర ను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు రైతులు కార్మికులు యువజనలో విద్యార్థులు మహిళలు మేధావులు ప్రజాస్వామ్యవాదులు అన్ని వర్గాలు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి ఎస్కే నాగుల్ మీరా, ఎల్లంకి మధు కంచర్ల రాఘవేందర్రావు కిలారి వినోద్, AIYF జిల్లా సహాయ కార్యదర్శి ఎస్కే చాంద్ పాషా ఆవిష్కరించారు




