Palvancha: భగ్గుమన్న నిరసనలు.. నటరాజ్ సెంటర్‌లో ఏం జరిగిందంటే?

Palvancha: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై సీపీఐ శ్రేణులు మండిపడ్డాయి.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 16 May 2026 4:15 PM IST
Palvancha
X

Palvancha: భగ్గుమన్న నిరసనలు.. నటరాజ్ సెంటర్‌లో ఏం జరిగిందంటే?

పాల్వంచ: కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడాన్ని నిరసిస్తూ పాల్వంచ నటరాజ్ సెంటర్ వద్ద సీపీఐ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ, "పెట్రోల్, డీజిల్ ధరలను అడ్డగోలుగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కేంద్రం వెంటనే ధరలు తగ్గించాలి" అని డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతో ఆటో డ్రైవర్లు, రైతులు, సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే కేంద్రం స్పందించి ఉపశమనం కలిగించాలని కోరారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

Next Story