Kothagudem: పెట్రోల్, డీజిల్ కొరత తీర్చండి: సీపీఐ డిమాండ్

Kothagudem: కొత్తగూడెంలో సీపీఐ ఆధ్వర్యంలో ఖాళీ గ్యాస్ సిలిండర్లతో నిరసన. పెట్రోల్ డీజిల్ కొరత మరియు గ్యాస్ ధరల పెరుగుదలపై ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆగ్రహం.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 6 May 2026 5:03 PM IST
Kothagudem
X

Kothagudem: పెట్రోల్, డీజిల్ కొరత తీర్చండి: సీపీఐ డిమాండ్

Kothagudem: పెట్రోల్, డీజిల్ కొరత, కమర్షియల్ గ్యాస్ ధరల పెంపునకు వ్యతిరేకంగా సీపీఐ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా కొత్తగూడెం పట్టణ సీపీఐ కార్యదర్శి జమలయయ్య ఆధ్వర్యంలో శేషగిరి భవన్ నుంచి కొత్తగూడెం బస్టాండ్ సెంటర్ అమరవీరుల స్థూపం వరకు ఖాళీ కమర్షియల్ గ్యాస్ సిలిండర్లతో ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

పెట్రో, డీజిల్, కొరతను నివారించాలని, కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. ధర్నాలో ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, పార్టీ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్ పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కేంద్ర ప్రభుత్వ విధానాలపై తీవ్రంగా విమర్శలు చేశారు‌.

యుద్ధ వాతావరణం కారణంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ నిల్వలు ఉంచడంలో కేంద్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని తీవ్రంగా విమర్శించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరపై ఏకంగా 900 రూపాయలు పెంచడం వల్ల దాని ప్రభావంతో సామాన్యులపై భారం పడుతుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కమర్షియల్ సిలిండర్ ధరలు పెరగటం వల్ల హోటళ్ళలో ధరలను విపరీతంగా పెంచారన్నారు.

పెట్రోలు డీజీలు గ్యాస్ కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రభుత్వాలు ధరలు అధికారికంగా పెంచకపోయినా వాటి ధరలు పెరిగాయని,ప్రధాని మోడీ నోరు మెదపడం లేదని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, గ్యాస్ కృత్రిమ కొరతలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉందని, కేంద్రంపై మరింత బాధ్యత ఉందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఓటమిలతో సంబరాలు చేసుకోవడం కాదని, దేశ ప్రజల బాగోగుల గురించి ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి హితవు పలికారు.

తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్ డీజిల్ కొరత కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరల తగ్గింపు విషయంపై దృష్టి పెట్టాలని లేకుంటే సిపిఐ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమంలో నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ, నాయకులు సలిగంటి శ్రీనివాస్, వాసిరెడ్డి మురళి, కోలాపురి ధర్మరాజు, యూసుఫ్, ఫహీందాదా, మాచర్ల శ్రీనివాస్, ఏఐటీయూసీ సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ రీజినల్ బ్రాంచ్ సెక్రటరీ వంగ వెంకట్,

ఎన్ఎఫ్ఐ డబ్ల్యు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ కరీష రత్నకుమారి, కార్పొరేటర్ మునిగడప పద్మ, మేదిని లక్ష్మి, దార్ల లక్ష్మి, పైడిపల్లి లక్ష్మి, శాంతి, అరుణ తదితరులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story