Kothagudem: ఊకే శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం, ఐద్వా!

Kothagudem: హైదరాబాద్ తుక్కుగూడలో ఆదివాసీ నర్స్ ఊకే శిరీష హత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని, కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని సీపీఎం, ఐద్వా డిమాండ్ చేశాయి.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 31 Aug 2026 9:05 PM IST
Kothagudem
X

Kothagudem: ఊకే శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలి: సీపీఎం, ఐద్వా!

తుక్కగూడ: గత మూడు రోజులక్రిందట హైదరాబాద్ తుక్కగూడలోని ప్రైమ్ కేర్ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తున్న ములకలపల్లి మండలం చౌటుగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి యువతి ఊకే శిరీష ను అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసిన దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని, బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం జ్యోతి డిమాండ్ చేశారు.

ఈరోజు మరణించిన యువతి శిరీష ఇంటికి వెళ్లి వారి కుటుంబాన్ని ఓదార్చి ప్రగాడ సానుభూతిని ప్రకటించి మాట్లాడుతూఇప్పుడిప్పుడే ఆదివాసి యువత అవకాశాలను అందిపుచ్చుకొని పెద్ద చదువులు చదువుతూ ఉద్యోగాలు చేస్తున్నారని మారుమూల గ్రామాల నుంచి హైదరాబాద్ స్థాయి దాకా వెళ్లి ఉద్యోగాలు చేస్తూ వారి కుటుంబానికి ఆసరా అవుతున్న సందర్భంలో ఇలాంటి చర్యలు అత్యంత దారుణం అని అన్నారు.

స్వతంత్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు దాటుతున్న ఇప్పటికీ మహిళకు సమాజంలో భద్రత కరువైందని దీనికి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తూ వారి కుటుంబానికి కోటి రూపాయల పరిహారం,కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మారుతున్న సమాజంలో ఇలాంటి ఆటవిక చర్యలు మహిళల పట్ల,ఇలాంటి దారుణాలు జరగడం సిగ్గుచేటని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం మహిళల భద్రత పట్ల కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు వీరి వెంట సిపిఎం మండల కార్యదర్శి ముదిగొండ రాంబాబు,గౌరి నాగేశ్వరావు, నిమ్మల మధు, గడ్డం వెంకటేశ్వర్లు అమల, తదితరులు వున్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story