Julurpad: గుండేపూడి గ్రామ స్థానిక సమస్యలు పరిష్కరించాలి సీపీఎం డిమాండ్!
Julurpad: గుండేపూడి స్థానిక సమస్యలు పరిష్కరించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఎంపీడీఓ, కార్యదర్శికి వినతిపత్రం. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు, పట్టాలు ఇవ్వాలని డిమాండ్.
Julurpad: గుండేపూడి గ్రామ స్థానిక సమస్యలు పరిష్కరించాలి సీపీఎం డిమాండ్!
Julurpad: జూలూరుపాడు మండలం గుండేపూడి గ్రామ పంచాయతీ స్థానిక సమస్యలు పరిష్కరించాలని ఈరోజు పంచాయతీ కార్యాలయం లో ఎంపీడీఓ, కార్యదర్శి కి వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్బంగా సిపిఎం నాయకులు భానోత్ మధు మాట్లాడుతూ సంవత్సరం క్రితం itda ద్వారా ప్రకటించిన ఇందిరమ్మ ఇళ్ల జాబితాలో అర్హులకు సంబందించిన ఇళ్ల సర్వేలు చేశారు కానీ పట్టాలు ఇప్పటివరకు ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారని అన్నారు గుడిసెలు లేని గ్రామాలుగా చేయడమే ప్రజా పాలన లక్ష్యం అనే గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ఇప్పటివరకు రెండవ విడత ఇందిరమ్మ ఇల్లు ఎందుకని ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఎన్నికలలు లబ్ది పొందెందుకు ఇలాంటివి వాడుకుంటున్నారని ప్రభుత్వాన్ని విమర్శించారు గత brs ప్రభుత్వం 10సంవత్సరాల కాలంలో ఒక్కసారే డబల్ bed రూమ్ ఇండ్లను ఇచ్చి చేతులు దూలుపుకుందని అదే మాదిరిగా కాంగ్రెస్ కూడా ఒక్కసారికే పరిమితం కావడం తో దొందు దొందే అని దుయ్యాబట్టారు అదేవిదంగా రెండవ జాబితా రేపు ఎల్లుండి అంటూ కాలయాపన చేస్తున్నారు తప్ప ముందడుగు వేయడం లేదు అని ఏద్దెవచ్చేసారు మొదటి విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చివరి బిల్లులు రాక లబ్ధిదారులు నానా అవస్థలు పడుతున్నారు అని వడ్డీలు పెరుగుతున్నాయి తప్ప ప్రభుత్వం నుండి సహాయం అందకపోవటంతో ఆందోళన చెందుతున్నారని గుర్తు చేశారు.
గ్రామ పంచాయితీ కి నిధులు రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా సమస్యలు తిష్ట వేసిందని అన్నారు గతంలో గ్రామ పంచాయితీ లకు ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకు లను కొనుగోలు చేశారు కానీ కరోనా సమయంలో విపరీతంగా బ్లీచింగ్ వాడటంతో అవి పూర్తిగా ఉపయోగం లేకుండా నిరూపయోగంగా ఉన్నాయని వెంటనే మరమ్మత్తులు నిర్వహించి ఉపయోగం లోని తీసుకురావాలని డిమాండ్ చేశారు అదేవిదంగా ఎలినో ప్రభావం తో గ్రామలలో విషజ్వరాలు డెంగ్యూ, మలేరియా, లాంటి వైరల్ జ్వరాలు ప్రభాళుతున్నాయని కాబట్టి గ్రామాలలో వైద్య శిభిరాలు వెంటనే నిర్వహించాలని కోరారు.
ఈ కార్యక్రమం లో సిపిఎం నాయకులు , వల్ల మల్ల చందర్ రావు ఇల్లంగి సీతారాములు, అనగంటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.




