Bhadradri Kothagudem: రైతు సమస్యలపై సీపీఎం ధర్నా
Bhadradri Kothagudem: రైతులు పండించిన పంటలను మద్దతు ధరకు పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది.
Bhadradri Kothagudem
Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్ ఎదుట.. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా.. ధర్నా లో పాల్గొన్న పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు కనకయ్య.
ఈసందర్భంగా పార్టీ శ్రేణులు
రైతాంగం పండించిన అన్ని రకాల పంటలను పూర్తిస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేయాలని,
కాటాలలో మోసం, మిల్లర్ల మోసం అరికట్టాలని,
తరుగులు, తేమ పేరుతో రైతులను నష్టపరిచే విధానాలను మానుకోవాలని నినాదాలు చేశారు..
ఈసందర్భంగా..సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..
భద్రాద్రి జిల్లాలో రైతాంగం పండించిన మొత్తం పంటను కొనుగోలు చేయాలని, రైతాంగ సమస్యలను పరిష్కరించాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ప్రభుత్వం స్పందించి రైతులు పండించిన అన్ని పంటలను పూర్తిస్థాయిలో మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
మద్దతు ధరలు ఇచ్చే విషయంలో జరుగుతున్న అవకతవకలపై ఆగ్రహం వ్యక్తం చేశారు..
మొక్కజొన్నలను 1700 కి కొనుగోలు చేస్తున్నారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ కాటాలు సరిగా పనిచేయడం లేదని, తరుగుల పేరుతో మోసం , మిల్లర్లు మోసాలు చేస్తున్నారని ఇవన్నీ కూడా ప్రభుత్వం ,అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే దోపిడి సాగుతున్నదని
విమర్శించారు.
జిల్లాలో ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతున్న అన్యాయాన్ని దోపిడిని అరికట్టాలని ధర్నా కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
జిల్లాలో రైతులు ఇప్పటికే అనేక రకాల పంటలు పండించారని, ఒకపక్క అకాల వర్షాలతో రైతుల తీవంగా నష్టపోతున్నారని, మద్దతు ధర రాక ఇబ్బందులు పడుతున్నారని, మద్దతు ధరరతో పాటు, దోపిడి, కాటాలలో జరుగుతున్న మోసాలు, తేమ పేరుతో ఐదు కేజీల తరుగు తీస్తున్నారని ఆరకంగా కూడా రైతులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.పెరిగిన ధరలకు అనుగుణంగా, పండించిన మొత్తం పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
ధర్నా కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ,
కారం పుల్లయ్య,
లిక్కి బాలరాజు,రేపాకుల శ్రీనివాస్..
పార్టీ జిల్లా కమిటీ సభ్యులు వాంకుడోత్ గోపాల్,
భూక్యా రమేష్,కొండబోయిన వెంకటేశ్వర్లు,వీర్ల రమేష్,మోరంపూడి శ్రీనివాసరావు..
తులసీ రాం,దొడ్డ లక్ష్మి నారాయణ,కే.సత్య..
వి.సత్య వాణి, మాధవి,
శెట్టి వినోద,
శంకర్,
రైతు సంఘం నాయకులు కాట్రాల తిరుపతి రావు,
నలగోపు పుల్లయ్య,
బచ్చలకూర శ్రీనివాసరావు.




