Aswaraopeta: అశ్వారావుపేటలో రూ.4 కోట్ల గోల్డ్ లోన్ మోసం.. నిందితుడి అరెస్ట్!

Aswaraopeta: అశ్వారావుపేటలో తక్కువ వడ్డీకి గోల్డ్ లోన్ల పేరుతో కస్టమర్ల బంగారంతో రూ.4 కోట్ల మోసానికి పాల్పడిన బ్యాంకు ఉద్యోగి సుబ్బును పోలీసులు అరెస్టు చేశారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 6 Oct 2026 10:54 PM IST
Aswaraopeta
X

Aswaraopeta: అశ్వారావుపేటలో రూ.4 కోట్ల గోల్డ్ లోన్ మోసం.. నిందితుడి అరెస్ట్!

అశ్వారావుపేట: అశ్వారావుపేటలో బంగారు ఆభరణాలను తక్కువ వడ్డీకి ఎక్కువ మొత్తంలో గోల్డ్ లోన్ ఇప్పిస్తానని నమ్మించి, కస్టమర్లకు తెలియకుండా వారి బంగారాన్ని ఇతరుల పేర్లపై బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల్లో తాకట్టు పెట్టి అధిక మొత్తంలో రుణాలు పొందుతూ మోసాలకు పాల్పడిన కేసులో ప్రధాన నిందితుడు లింగిశెట్టి నాగ సుబ్రమణ్యం @ సుబ్బు (33), అశ్వారావుపేటను పోలీసులు అరెస్ట్ చేశారు.

నిందితుడు గతంలో శ్రీరామ్ ఫైనాన్స్‌లో, ప్రస్తుతం అశ్వారావుపేట CSB బ్యాంకులో *Customer Relationship Officer (CRO)*గా పనిచేస్తున్నట్లు కస్టమర్ల నమ్మకాన్ని ఉపయోగించుకుని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలను సేకరించి, వారి అనుమతి లేకుండా ఇతర వ్యక్తుల పేర్లపై గోల్డ్ లోన్లు పొందినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు.

ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన వివరాల ప్రకారం, వివిధ వ్యక్తుల నుండి సేకరించిన బంగారు ఆభరణాలను ఇతరుల పేర్లపై తాకట్టు పెట్టి సుమారు రూ.4 కోట్ల మేర గోల్డ్ లోన్ లావాదేవీలు నిర్వహించినట్లు నిందితుడు వెల్లడించాడు.

నిందితుడి వద్ద నుండి CSB బ్యాంక్ మరియు శ్రీరామ్ ఫైనాన్స్‌కు సంబంధించిన రెండు ఐడెంటిటీ కార్డులు, 2 డైరీలు, 4 ఫైల్ ఫోల్డర్లు, 2 క్లాత్ రిజిస్టర్లు, గోల్డ్ లోన్ లెక్కలు మరియు కొన్ని రశీదులు స్వాధీనం చేసుకున్నారు.

నిందితుడు కస్టమర్లను మోసం చేసి సంపాదించిన ఆస్తులు, నగదు మరియు ఇతర ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరింత మంది బాధితులు, గోల్డ్ లోన్ లావాదేవీలు మరియు సంబంధిత వ్యక్తుల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది అని తెలిపారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA