Kothagudem: పోలవరం ముంపు ప్రాంతాల పరిశీలనకు ఉన్నతాధికారుల పర్యటన

Kothagudem: భద్రాద్రి జిల్లా బూర్గంపాడులో కేంద్ర జల సంఘం (CWC) ఉన్నతాధికారుల బృందం పర్యటన.

G Ravi, Bhadradri
Published on: 3 Jun 2026 11:45 AM IST
Kothagudem
X

Kothagudem: పోలవరం ముంపు ప్రాంతాల పరిశీలనకు ఉన్నతాధికారుల పర్యటన

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో నేడు పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ముంపు సమస్యలపై కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర జల సంఘం (CWC), పోలవరం ప్రాజెక్టు అథారిటీతో పాటు అంతర్రాష్ట్ర జల వనరుల శాఖ అధికారులు జిల్లాకు చేరుకున్నారు.

అధికారులు ముందుగా సారపాకలోని ఐటీసీ విశ్రాంతి భవనానికి చేరుకుని పోలవరం బ్యాక్‌వాటర్ ముంపు పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బూర్గంపాడు మండలంలోని ముంపు ప్రభావిత గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించనున్నారు.

పోలవరం ప్రాజెక్టు కారణంగా ఏర్పడుతున్న బ్యాక్‌వాటర్ ప్రభావం, గ్రామాల భద్రత, ప్రజల సమస్యలు, పునరావాస అంశాలపై అధికారులు నివేదికలు సేకరించి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం. స్థానిక ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story