Ashwaraopeta: అశ్వారావుపేటలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం!
Ashwaraopeta: అశ్వారావుపేట ఐటీడీఏ కేంద్రంలో సైబర్ క్రైమ్ అవగాహన సదస్సు. ఆన్లైన్ మోసాలు, ఓటీపీ ఫిషింగ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ దేవ్ సింగ్, ఎస్బీఐ అధికారుల సూచన.
Ashwaraopeta: అశ్వారావుపేటలో సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం!
Ashwaraopeta: ఐటీడీఏ యువజన శిక్షణ కేంద్రంలో అశ్వారావుపేట పోలీస్,ఎస్బీఐ బ్యాంకు అధికారులతో కలిసి సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ మోసాలు, హ్యాకింగ్, వ్యక్తిగత సమాచార దొంగతనం, క్రెడిట్ కార్డు లిమిట్ పెంపు పేరుతో జరిగే మోసాలు, ఫిషింగ్, ఓటీపీ మోసాలపై అవగాహన కల్పించారు.
ప్రజలు తమ ఓటీపీలు, పాస్వర్డ్లు, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోవద్దని, గుర్తుతెలియని ఫోన్ కాల్స్, అనుమానాస్పద లింకులు, నకిలీ బ్యాంకింగ్ ఆఫర్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్ నంబర్కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని తెలిపారు. ఉన్నతాధికారుల సూచనలకు అనుగుణంగా ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కల్పిస్తున్నట్లు అశ్వారావుపేట అడిషనల్ ఎస్ఐ జె. దేవ్ సింగ్ తెలిపారు.




