Kothagudem: కొత్తగూడెం అదనపు జిల్లా జడ్జిగా డి. రాంప్రసాదరావు
Kothagudem: కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా డి. రాంప్రసాదరావు, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బి. రవికుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు.
Kothagudem: కొత్తగూడెం అదనపు జిల్లా జడ్జిగా డి. రాంప్రసాదరావు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం: కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా డి. రాంప్రసాదరావు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఈ పదవిలో కొనసాగిన ఎస్. సరిత హైదరాబాద్‌కు బదిలీ కావడంతో ఆమె స్థానంలో డి. రాంప్రసాదరావు నియమితులయ్యారు.
డి. రాంప్రసాదరావు 2023 ఫిబ్రవరిలో అదనపు జిల్లా న్యాయమూర్తిగా తొలిసారిగా ఖమ్మంలో నియమితులై మూడేళ్ల పాటు విధులు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్‌లోని కూకట్పల్లి కోర్టులో అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఆరు నెలల పాటు పనిచేశారు. అక్కడి నుంచి బదిలీపై కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తిగా నియమితులై బాధ్యతలు చేపట్టారు.
ఇదిలా ఉండగా, కొత్తగూడెంలో రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్‌గా విధులు నిర్వహిస్తున్న బి. రవికుమార్ గురువారం కొత్తగూడెం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరు న్యాయమూర్తుల బాధ్యతల స్వీకరణతో కొత్తగూడెం న్యాయస్థానాల్లో నూతన నియామకాలు అమల్లోకి వచ్చాయి.




