Kothagudem: దమ్మపేట బార్ అసోసియేషన్ నేతలు ఐ.ఎల్.పి.ఏ.లో చేరిక!

Kothagudem: దమ్మపేట బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ILPA)లో చేరి సభ్యత్వం స్వీకరించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 11 Aug 2026 9:55 PM IST
Kothagudem
X

Kothagudem: దమ్మపేట బార్ అసోసియేషన్ నేతలు ఐ.ఎల్.పి.ఏ.లో చేరిక!

కొత్తగూడెం: ఇండియన్ లీగల్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ (ILPA)లో దమ్మపేట బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు సభ్యత్వం స్వీకరించారు. న్యాయవాదుల సంక్షేమం, న్యాయవాదుల వృత్తిపరమైన హక్కుల పరిరక్షణ, న్యాయవ్యవస్థ బలోపేతం, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ILPA చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులై వారు సంఘంలో చేరినట్లు తెలిపారు.

దమ్మపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు గోంది మురళి మోహన్, ప్రధాన కార్యదర్శి లక్కినేని నరేంద్ర బాబు, సీనియర్ న్యాయవాదులు ముప్పిడి శ్యాం సుధాకర్, త్రినేటి సంజయ్, తామా బాలరాజు, కాలం సంధ్యారాణి, వెంకటరమణ తదితరులు ILPAలో సభ్యత్వం స్వీకరించారు.

ఈ సందర్భంగా ILPA రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మారపాక రమేష్, మహమ్మద్ సాదిక్ పాషా, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దొడ్డ సామంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రపాటి కృష్ణ చేతుల మీదుగా నూతన సభ్యులకు సభ్యత్వం అందజేశారు.

ఈ సందర్భంగా ILPA రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్లకు చెందిన న్యాయవాదులను ఒకే వేదికపైకి తీసుకువచ్చి, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం సమిష్టిగా కృషి చేస్తామని తెలిపారు. న్యాయవాదుల సంక్షేమం, వృత్తి గౌరవ పరిరక్షణ, హక్కుల సాధన, సామాజిక న్యాయం, రాజ్యాంగ పరిరక్షణ వంటి అంశాలపై ILPA మరింత విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతుందని పేర్కొన్నారు.

దమ్మపేట బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు ILPAలో చేరడంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంస్థ మరింత బలోపేతం అవుతుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లాలోని అన్ని బార్ అసోసియేషన్ల న్యాయవాదులతో సమన్వయం చేసుకుంటూ, న్యాయవాదుల సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడుతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట బార్ అసోసియేషన్‌కు చెందిన న్యాయవాదులు, ILPA రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు మరియు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story