Dammapeta: నెమలిపేట ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే జారె!

Dammapeta: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నెమలిపేటలో రూ.35 లక్షలతో కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ఎమ్మెల్యే జారె ఆదినారాయణ శంకుస్థాపన చేశారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA
Published on: 9 Nov 2026 5:30 PM IST
Dammapeta
X

Dammapeta: నెమలిపేట ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం: ఎమ్మెల్యే జారె!

దమ్మపేట: దమ్మపేట పంచాయతీ పరిధిలోని నెమలిపేట గ్రామ ప్రజలు వర్షాకాలంలో ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు శ్రీకారం చుట్టారు గ్రామంలో రెండు రోజుల క్రితం క్షేత్రస్థాయిలో పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించి కాలువపై ఉన్న పాత బ్రిడ్జి ఇరుకుగా ఉండటంతో వర్షపు నీరు సక్రమంగా కిందకు వెళ్లక గ్రామం ముంపునకు గురవుతున్న విషయాన్ని గుర్తించారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు పాత బ్రిడ్జి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వానికి నివేదికలు పంపించారు ఎమ్మెల్యే గారి చొరవతో కేవలం రెండు రోజుల్లోనే నిర్మాణానికి అనుమతులు రావడంతో ఈరోజు కొత్త బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు.

అంతేకాకుండా వర్షపు నీరు గ్రామంలోకి రాకుండా కాలువకు ఇరువైపులా పటిష్టమైన కాంక్రీట్ గోడలు నిర్మించాల్సిన అవసరాన్ని కూడా గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కక్కిరాల రమేష్ గారు, స్థానిక సర్పంచ్ పగడాల రమాదేవి రాంబాబు గారు, టౌన్ అధ్యక్షులు చిన్నశెట్టి చిట్టిబాబు గారు, ఉప సర్పంచ్ ఆంగోత్ శ్రీనివాసరావు గారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వార్డు మెంబర్లు మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SANKURATHRI SATISH, ASWARAOPETA

SANKURATHRI SATISH, ASWARAOPETA