Sathupally: రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు.. ఆ పంటలు వేస్తేనే సేఫ్!
Sathupally: ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో ఖమ్మం జిల్లా రైతులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి (DAO) డి. పుల్లయ్య సూచించారు.
Sathupally: రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు.. ఆ పంటలు వేస్తేనే సేఫ్!
సత్తుపల్లి: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఎల్ నినో ప్రభావం వల్ల సంభవించే వర్షాల హెచ్చుతగ్గుల పట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వ్యవసాయ అధికారి ఖమ్మం శ్రీ డి. పుల్లయ్య తెలిపారు. మండల వ్యవసాయ అధికారి (MAO), సత్తుపల్లితో కలిసి పంటల పరిస్థితిని పరిశీలించిన అనంతరం కిష్టారం సొసైటీ నందు జరిగిన ప్రత్యమ్నాయ పంటల సాగు మరియు పంట కుంటల నిర్మాణం కార్యకమానికి ముఖ్య అతిథిగా హాజరైఆయన ఈ సూచనలు చేశారు.
ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు ఆలస్యంగా పడటం, మధ్యలో దీర్ఘకాలిక వర్ష విరామాలు, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ పరిస్థితులు వరి, పత్తి, మొక్కజొన్న, కంది, పెసర, మినుము తదితర ఖరీఫ్ పంటల పెరుగుదలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
- వర్షాభావ పరిస్థితుల వలన వరి పంట ను తగ్గించి ప్రత్యామ్నాయ పంటలు అయిన పెసర, మినుము, జొన్న, సజ్జ, రాగులు, నువ్వులు మరియు ఉలవ పంట లు సాగు చేయాలని అధిక నీటి వినియోగించే పంటలు నీ తగ్గించాలని ముఖ్యంగా చెరువులు కింద మరియు బోర్ బావుల కింద వరి పంట సాగు చేయొద్దని దీనివలన భూగర్భజలాలు అడుగంటి తాగు నీరు కూడా అందక ఇబ్బంది పడే ప్రమాదం ఉందని తెలిపారు
- వ్యవసాయ శాఖ సిఫారసు చేసిన స్వల్పకాలిక, కరవును తట్టుకునే పంట రకాలను ఎంపిక చేసుకోవాలి.
- నీటి సంరక్షణ చర్యలలో భాగంగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల యందు తప్పకుండా పంట కుంటల నిర్మాణాన్ని చెప్పట్టాలి తెలియజేశారు.
- వాతావరణ శాఖ సూచనలు మరియు వ్యవసాయ శాఖ సలహాలను ఎప్పటికప్పుడు పాటించాలి. ఎల్ నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని పంటల నిర్వహణలో శాస్త్రీయ పద్ధతులు పాటిస్తే దిగుబడిలో నష్టాన్ని గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలుకులు V. శ్రీనివాస రెడ్డి , మండల వ్యవసాయ అధికారి (MAO) సత్తుపల్లి D N K Srinivasa rao, AEO D. నరేష్, PACS చైర్మన్ Ch. లక్ష్మి నారాయణ, సర్పంచ్ నరుకుళ్ల రాజేశ్వరి అప్పారావు సొసైటీ CEO మరియు సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.




