Khammam: డిసెంబర్ 9న కల్లూరు గూడెం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం!
Khammam: డిసెంబర్ 9న కల్లూరు గూడెం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.
Khammam: డిసెంబర్ 9న కల్లూరు గూడెం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం!
Khammam: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం సాయంత్రం కలిసి ఖమ్మం జిల్లా సమస్యలతో పాటు అశ్వరావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాలకు సంబంధించిన పలు సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వినతి పత్రం అందజేశారు.
డిసెంబర్ 9న వేంసూరు మండల పరిధిలోని కల్లూరు గూడెం ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి మరియు ఖమ్మం లో వెలుగుమట్ల హౌసింగ్ మోడల్ కాలనీ ప్రారంభోత్సవానికి రావాలని ముఖ్యమంత్రిని మంత్రి తుమ్మల ఆహ్వానించారు.
అలాగే జూలూరుపాడు టన్నల పనులు మరియు సీతారామ ప్రాజెక్టు పనుల వివరాలను, వాటిలో ఉన్న సమస్యలను మంత్రి తుమ్మల ముఖ్యమంత్రి కి వివరించారు. అలాగే పామాయిల్ పంట వివరాలు, సాగు విస్తీర్ణం పెంచే చర్యలు తో పాటు పలు సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి తుమ్మల వివరించారు.




