Kothagudem: గ్రామపంచాయతీ కార్మికులకు రూ.18 వేల జీతం ఇవ్వాలి!
Kothagudem: కార్మికులకు జీవో 6 ప్రకారం రూ.14 వేల నుండి రూ.18 వేల వరకు కనీస వేతనాలు చెల్లించాలని టీయుసిఐ (TUCI) అనుబంధ యూనియన్ జిల్లా కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు డిమాండ్ చేశారు.
Kothagudem: గ్రామపంచాయతీ కార్మికులకు రూ.18 వేల జీతం ఇవ్వాలి!
కొత్తగూడెం: గ్రామపంచాయతీ కార్మికులకు జీవో 6 ప్రకారము 14 నుంచి 18 వేల వేతనాలను ఇవ్వాలి. తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు డిమాండ్. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కనీస వేతనాల జీవో 6 ప్రకారము 14 నుంచి 18 వేల వేతనాలను గ్రామపంచాయతీ కార్మికులకు ఇవ్వాలని లేదా జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టీ యు సి ఐ).
తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఏదులాపురం గోపాలరావు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జూలూరుపాడు మండలం పరిషత్ కార్యాలయం లో యంపిడిఓ,వెంగన్నపాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు కార్యదర్శి లకు వినతి పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా గోపాలరావు మాట్లాడుతూ
రాష్ట్రంలో ఉన్న 73 షెడ్యూల్ జీవోలను రద్దు చేస్తూ, మూడు జోన్లుగా చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కొత్త వేతనాలను పెంపుదల ప్రకటించారని,ఈ వేతనాల పెంపుదల జీవో 6ను విడుదల చేస్తూ గెజిట్ ముద్రించారని, రాష్ట్రానికి పేరు ప్రతిష్టలు తెస్తున్న వేలాదిమంది గ్రామపంచాయతీ వర్కర్లను కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ వర్కర్ల గా గుర్తించి, పెంచిన జీతాలను వర్తింపచేయాలని డిమాండ్ చేశారు .అతి తక్కువ వేతనాలతో కడు దుర్భరమైన జీవితాలు గడుపుతూ కష్ట పడుతున్న గ్రామపంచాయతీ కార్మికులకు కొత్త జీవోలు అమలు కాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యారని గోపాలరావు ఆవేదన వ్యక్తం చేశారు.
.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీలో సుమారు 60000 మంది కార్మికులు పనిచేస్తున్నారని వారందరికీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాలు అందజేయాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే ఆలోచించి అతి తక్కువ వేతనం పొందుతున్న గ్రామపంచాయతీ కార్మికులకు కొత్తగా పెంచిన జీతాలు వర్తింపజేయాలని గోపాలరావు డిమాండ్ చేశారు.
అనేక సంవత్సరాల నుండి ఎలాంటి ఉద్యోగ భద్రత లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా అభద్రత భావంతో పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు పిఎఫ్ అమలు చేయాలని, కార్మికులకు నేడు నెలకు 9500 రూ||లు మాత్రమే జీతాలు లభిస్తున్నాయని, కనుక కార్మికులు కట్టాల్సిన ప్రావిడెంట్ ఫండ్ వాటాను కూడా ప్రభుత్వమే భరించాలని గోపాలరావు కోరారు .
గ్రామపంచాయతీ కార్మికులకు
ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా ప్రతి నెల ఒకటవ తేదీ నాడు గ్రీన్ ఛానల్ ద్వారా జీతాలు ఇవ్వాలని గోపాలరావు డిమాండ్ చేశారు. అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి,పని భారం తగ్గించాలని గోపాలరావు కోరారు.
ఈ కార్యక్రమంలో భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా వినతి పత్రం ఇస్తున్న టి యు సి ఐ అనుబంధం గ్రామపంచాయతీట వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఎదలాపురం గోపాలరావు, యూనియన్ మండల అధ్యక్షులు నాగు, యూనియన్ మండల కార్యదర్శి ధనుమంతరావు, మండల ఉపాధ్యక్షుడు నరేష్, సహాయ కార్యదర్శి శిరంశెట్టి వినోద్, మండల నాయకులు కార్మికులు గౌష్ భాష, వంశి నవీన్,గురవమ్మ,శివ, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.




