Palwancha: దీపావళి పర్వదినాన పెద్దమ్మతల్లిని దర్శించుకున్న భక్తులు
Palwancha: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ శ్రీ కనకదుర్గ దేవస్థానంలో భక్తులు పెద్దమ్మతల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
Palwancha: దీపావళి పర్వదినాన పెద్దమ్మతల్లిని దర్శించుకున్న భక్తులు
పాల్వంచ: దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ కనకదుర్గ దేవస్థానము (పెద్దమ్మగుడి) నందు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుండే పరిసర గ్రామాల నుండే కాక జిల్లా నలుమూలల నుండే కాక ఇతర జిల్లాల నుండి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. తమను చల్లగా చూడాలని వేడుకుంటూ బోనాలు సమర్పించారు.
ఈ సందర్భంగా దేవాలయ ఆవరణలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకములు నిర్వహించారు. అన్నప్రాశనలు, వాహనపూజలు, తలనీలాలు, అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, కనుములు, తదితర మొక్కులు చెల్లించుకొని అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదములను స్వీకరించారు.
భక్తులకు అవసరమైన ప్రత్యేక దర్శనమునకు క్యూలైన్లు, ఉచిత పులిహోర ప్రసాద వితరణ మరియు మంచినీటి వసతి, అన్నదానం తదితర ఏర్పాట్లను దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఏ.విజయ్ కుమార్ ఆదేశముల మేరకు సిబ్బంది పర్యవేక్షించారు.




