Kothagudem: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో క్రీడాకారులు ప్రతిభ చాటాలి!
Kothagudem: కొత్తగూడెం ఐడీఓసీలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్ పోస్టర్లను అదనపు కలెక్టర్లు డి. వేణుగోపాల్, విద్యా చందన సోమవారం ఆవిష్కరించారు.
Kothagudem: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో క్రీడాకారులు ప్రతిభ చాటాలి!
Kothagudem: తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సూచనల మేరకు సోమవారం ఐ డి ఓ సి కార్యాలయాలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్ పోస్టర్లను జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, జిల్లా యువజన మరియు క్రీడల అధికారి బి. అనూష ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ మాట్లాడుతూ, ఈ నెల 15వ తేదీన కేంద్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి చేతుల మీదుగా ఢిల్లీలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లోగో, మస్కట్‌ను ఆవిష్కరించినట్లు తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ నిర్వహించనున్నట్లు తెలిపారు .
జిల్లా వ్యాప్తంగా వివిధ క్రీడాంశాల్లో ప్రతిభ కలిగిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను చాటడంతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో పాల్గొన్న క్రీడాకారులకు లభించే సర్టిఫికెట్లకు భవిష్యత్తులో మంచి ప్రాధాన్యత ఉంటుందని, క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
జిల్లా వ్యాప్తంగా ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌పై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. పాఠశాలలు, జూనియర్, డిగ్రీ, ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో విద్యార్థులకు ఈ క్రీడా పోటీల ప్రాముఖ్యతను వివరించాలని సూచించారు. ప్రధాన కూడళ్లు, బస్టాండ్ ఆవరణలు, ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేయాలని, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాతో పాటు సోషల్ మీడియా ద్వారా కూడా విస్తృత ప్రచారం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.




