Kalluru: కల్లూరు, మండలపాడులో వినాయక మండపాలను సందర్శించిన దయానంద్!

Kalluru: ఖమ్మం జిల్లా కల్లూరు, మండలపాడులో వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI
Published on: 19 Sept 2026 4:08 PM IST
Kalluru
X

Kalluru: కల్లూరు, మండలపాడులో వినాయక మండపాలను సందర్శించిన దయానంద్!

Kalluru: ఖమ్మం జిల్లా కల్లూరు లో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా కల్లూరు పట్టణంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పెనుబల్లి మండలం మండలపాడు గ్రామంలో వినాయక చవితి నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కల్లూరు ఏఎంసీ చైర్మన్ బాగం నీరజా ప్రభాకర్ చౌదరి, కల్లూరు పట్టణ మున్సిపల్ చైర్మన్ ధారావత్ మోహన్ నాయక్, కల్లూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉస్మాన్ అలీ, వార్డు కౌన్సిలర్లు, కల్లూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అలాగే మండలపాడు గ్రామ సర్పంచ్ గాయం రమేష్, దిశా కమిటీ సభ్యులు పోతురాజు కిషోర్, పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

JAMMULA  RAJESH REDDY, SATHUPALLI

JAMMULA RAJESH REDDY, SATHUPALLI