Kothagudem: మద్యం మత్తులో దొరికిపోయిన కాలేజ్ బస్ డ్రైవర్లు!

Kothagudem: ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ఇద్దరు స్కూల్/కాలేజ్ బస్ డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 17 July 2026 11:31 PM IST
Kothagudem
X

Kothagudem: మద్యం మత్తులో దొరికిపోయిన కాలేజ్ బస్ డ్రైవర్లు!

కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు, విద్యార్థుల భద్రత మరియు రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్కూల్ బస్సులు, భారీ వాహనాలను తనిఖీ చేసి డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్ మరియు ఇతర సంబంధిత పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కేఎల్ఆర్ కాలేజ్ పాల్వంచ బస్సు డ్రైవర్ ఎస్ భాస్కర్ మరియు ఎస్ఆర్డిజి జూనియర్ కాలేజ్ కొత్తగూడెం బస్ డ్రైవర్ అజయ్ కుమార్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ఈ తనిఖీల్లో పట్టు పడడం జరిగింది. వారిపై సెక్షన్ 185 యమ్.వి యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి చట్టపరమైనచర్యలు తీసుకున్నారు. ఈ తనికెల్లో మొత్తం 185 కేసులు నమోదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని ఎవరైనా మద్యం సేవించి వాహనం నడిపినట్లయితే మోటారు వాహనాల చట్టం సెక్షన్ 185 యమ్.వి యాక్ట్ ప్రకారం నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, అలాగే డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, వాహనాలను అతివేగంగా నడపరాదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ ఉపయోగించరాదని, సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రోడ్డు భద్రతా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలను నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

Next Story