Edulapuram: రాజీవ్ గృహకల్పలో ఘనంగా సామూహిక కుంకుమ పూజలు

Edulapuram: ఏదులాపురం రాజీవ్ గృహకల్ప కాలనీలో ఘనంగా సామూహిక కుంకుమ పూజలు. హాజరైన మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంచార్జి దయాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అనిత.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 20 Sept 2026 11:07 PM IST
Edulapuram
X

Edulapuram: రాజీవ్ గృహకల్పలో ఘనంగా సామూహిక కుంకుమ పూజలు

ఏదులాపురం: ఏదులాపురం మున్సిపాలిటీ రెండో వార్డు పరిధిలోని రాజీవ్ గృహ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి ఉత్సవ కమిటీ యూత్ కాంగ్రెస్ నాయకులు ఏనుగు మహేష్ ఆధ్వర్యంలో మహిళలచే సామూహిక కుంకుమ పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమం లో మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.

ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డి గారు ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ పోకబత్తిన అనిత గారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తుమ్మూరు దయాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ..

ఆ గణనాథుడు అందరి అష్ట ఐశ్వర్యాలు ఆయురారోగ్యాలు కలగజేయాలని అదేవిధంగా ఈ రెండో వార్డు అభివృద్ధి పనులు విజయవంతంగా సాగాలని కోరుకోవడం జరిగింది.ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.