Kothagudem: కొత్తగూడెం: దీపావళి సందర్భంగా స్మశాన వాటికలో విద్యుత్ దీపాల ఏర్పాటు

Kothagudem: దీపావళి వేళ సమాధుల వద్ద దీపాలు వెలిగించేందుకు కొత్తగూడెం రామవరం వైకుంఠధామంలో కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ చొరవతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM
Published on: 8 Nov 2026 6:56 PM IST
Kothagudem
X

Kothagudem: కొత్తగూడెం: దీపావళి సందర్భంగా స్మశాన వాటికలో విద్యుత్ దీపాల ఏర్పాటు

కొత్తగూడెం: దీపావళి పండుగను పురస్కరించుకుని హిందూ సంప్రదాయం ప్రకారం నరక చతుర్దశి, అమావాస్య రోజుల్లో పితృదేవతల స్మారకార్థం సమాధుల వద్ద దీపాలు వెలిగించే ఆచారం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని రామవరం 18వ డివిజన్‌లో ఆల్ ఇండియా రేడియో స్టేషన్ ఎదురుగా గరిమెళ్ళపాడు వెళ్లే దారిలో

ఉన్న వైకుంఠధామం..స్మశాన వాటికలో విద్యుత్ దీపాల ఏర్పాటుకు డివిజన్ కార్పొరేటర్ కంచర్ల హిమాశ్రీ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

పండుగ రోజుల్లో స్మశాన వాటికకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా, సమాధుల వద్ద దీపాలు వెలిగించేందుకు వీలుగా లైట్లను ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ పనులను మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కంచర్ల జమలయ్య పర్యవేక్షించగా, మున్సిపల్ సిబ్బంది ఏర్పాట్లలో పాల్గొన్నారు.

దీపావళి సందర్భంగా ప్రజల సంప్రదాయాలకు అనుగుణంగా స్మశాన వాటికలో వెలుగులు నింపేలా చర్యలు చేపట్టారు.

T.KRISHNAM RAJU, KOTHAGUDEM

T.KRISHNAM RAJU, KOTHAGUDEM