Palvancha: కేటీపీఎస్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు

Palvancha: పాల్వంచ కేటీపీఎస్‌లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి పురస్కరించుకుని ఇంజనీర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. సీఈ మేకా ప్రభాకర్ రావు నివాళులర్పించారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN
Published on: 15 Sept 2026 6:07 PM IST
Palvancha
X

Palvancha: కేటీపీఎస్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు

పాల్వంచ: తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్, కేటీపీఎస్ విద్యుత్, థర్మల్ ఆధ్వర్యంలో భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య 165వ జయంతిని పురస్కరించుకుని ఇంజనీర్స్ డే వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.

కేటీపీఎస్ కాంప్లెక్స్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహానికి చీఫ్ ఇంజనీర్ మేకా ప్రభాకర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశ్వేశ్వరయ్య స్ఫూర్తితో ఇంజనీర్లందరూ అంకితభావంతో పనిచేసి టీజీ జెన్‌కోలో కేటీపీఎస్‌ను ప్రథమ స్థానంలో నిలపాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఎస్‌ఈలు టి. సత్యనారాయణ, పి. కృష్ణ, జి.వి. ధర్మారావు, ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్‌ఏఓ సతీష్, ఎస్‌ఎఫ్‌ఆర్‌ఐ రాజ్‌కుమార్, డివిజనల్ ఇంజనీర్లు, ఏడీఈలు, ఏఈలు పాల్గొన్నారు.

అసోసియేషన్ బ్రాంచ్ కార్యదర్శి డి. ఈశ్వర మహేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కొండాధర్, ఎ. శ్రీనివాసరావు, రాంబాబు, ప్రవీణ్, దివాకర్, కృష్ణ, హరికుమార్, పావని, అఖిల్, శ్రీవాణి, భాగ్యరాజ్, వాణి, నిషిత తదితరులు పాల్గొన్నారు.

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN

ALLADA RAMESH BABU, PALWANCHA TOWN