Madhira: సీసీ కెమెరా సాక్షిగా కుప్పకూలిన ప్రముఖ టీచర్ జయరాజు!
Madhira: మధిరలో విషాదం. ప్రముఖ ఇంగ్లీష్ ఉపాధ్యాయులు గారపాటి జయరాజు హార్ట్ స్ట్రోక్‌తో ఆకస్మిక మృతి.
Madhira: సీసీ కెమెరా సాక్షిగా కుప్పకూలిన ప్రముఖ టీచర్ జయరాజు!
మధిర: మధిర పట్టణం 2వ వార్డు ఎంప్లాయీస్ కాలనీకి చెందిన ప్రముఖ ఇంగ్లీష్ టీచర్ గారపాటి జయరాజు ఆకస్మిక మరణ వార్త తీవ్ర విషాదాన్ని కలిగించింది. హార్ట్ స్ట్రోక్‌తో ఆయన ఆకస్మికంగా మృతి చెందారు.గతంలో మధిరలోని భరత్ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్‌గా సేవలందిస్తూ అనేక మంది విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన చేశారు. ప్రస్తుతం ఖమ్మం మమతా రోడ్డులోని శ్రీ చైతన్య స్కూల్ (ఒలింపియాడ్ క్యాంపస్) లో పనిచేస్తూ, ఉపాధ్యాయులకు బోధనా విధానాల్లో మెళకువలు నేర్పిస్తూ విద్యారంగానికి విశేష సేవలు అందిస్తున్నారు.
తమ మృదుస్వభావం, అంకితభావం మరియు విద్యపై ఉన్న నిబద్ధతతో అందరి అభిమానాన్ని సంపాదించారు. సీసీ కెమెరా దృశ్యాల్లో ఆయన కుప్పకూలిన తీరు చూసిన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేసింది. ఇలాంటి మంచి వ్యక్తి అకస్మాత్తుగా మన మధ్య లేకపోవడం విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు తీరని లోటని వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు




