Enkoor: ఏన్కూరు, జూలూరుపాడుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు పరిశీలన
Enkoor: ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటరు నమోదు కేంద్రాలను వైరా ఇంచార్జులు పమ్మి అశోక్, వేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
Enkoor: ఏన్కూరు, జూలూరుపాడుల్లో పట్టభద్రుల ఓటరు నమోదు పరిశీలన
ఏన్కూరు, జూలూరుపాడు: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లో క్లస్టర్ల వారీగా ఏర్పాటు చేసిన ఓటరు నమోదు కేంద్రాలను జిల్లా కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి పమ్మి అశోక్ ఈరోజు సందర్శించి, నమోదు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులకు పలు సూచనలు చేశారు. అర్హులైన పట్టభద్రులను గుర్తించి, వారిని ఓటరుగా నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని, ప్రతి క్లస్టర్ పరిధిలో నమోదు కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని సూచించారు.
ఈ సందర్భంగా పమ్మి అశోక్ మాట్లాడుతూ..
“వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలి. క్లస్టర్ల వారీగా బాధ్యతలు తీసుకొని, ఓటరుగా నమోదు కాని పట్టభద్రులను గుర్తించాలి. నమోదు విధానంపై వారికి అవగాహన కల్పించి, అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేసుకునేలా సహకరించాలి.
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ రెడ్డి విజయానికి పట్టభద్రుల ఓటరు నమోదు అత్యంత కీలకం. ప్రతి నాయకుడు, కార్యకర్త ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని, అర్హులైన పట్టభద్రులందరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలి” అని పమ్మి అశోక్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రంలో జూలూరుపాడు మండల కాంగ్రెస్ అధ్యక్షులు మాలోత్ మంగీలాల్ నాయక్, ఎన్కూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు స్వర్ణ శిరీష నరేందర్ కుమార్, ఏన్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ లచ్చిరాం నాయక్, జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి కొప్పుల ప్రభావతి రెడ్డి, స్థానిక క్లస్టర్లలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




