Yellandu: యువకుల జీవితాలను విషతుల్యం చేస్తున్న మత్తు పదార్థాలను తరిమికొడదాం!
Yellandu: ఇల్లందులో మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా PDSU, PYL ఆధ్వర్యంలో ప్రదర్శన. నేరస్తులను కాదు, నేర ప్రేరేపితాలను అంతమొందించాలని డిమాండ్.
Yellandu: యువకుల జీవితాలను విషతుల్యం చేస్తున్న మత్తు పదార్థాలను తరిమికొడదాం!
Yellandu: విద్యార్థి, యువకుల జీవితాలను విషతుల్యం చేస్తున్న మత్తు పదార్థాలపై సమాజం మొత్తం అప్రమత్తం కావాలని కొమరారం సర్పంచ్ అజ్మీర బిచ్చ, పి డి యస్ యూ రాష్ట్ర అధ్యక్షులు కాంపాటి పృథ్వీ పి వై ఎల్ ఇల్లందు డివిజన్ కార్యదర్శి వెలుగు శాంతారావు అన్నారు.పి డి యస్ యూ, పి వై ఎల్ ఆధ్వర్యంలో ఎల్లన్న నగర్ గ్రామపంచాయతీ పరిధిలోని తొంట బాలు తండాలో విద్యార్థి యువకులు ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కొమరారం సర్పంచ్ అజ్మీర బిచ్చ, కాంపాటి పృథ్వీ , వెలుగు శాంతారావు మాట్లాడుతూ దేశంలో జరిగిన నేరాలను పరిశీలిస్తే మత్తు పదార్థాలకు బానిసైన యువకుల నుండే ఎక్కువ నేరాలు జరుగుతున్నట్లుగా పోలీస్ శాఖ, ప్రభుత్వ యంత్రాంగం మీడియా ద్వారా అనేక సందర్భాలలో ప్రకటించారు.
మత్తు పదార్థాలకు బానిసై హత్యలు,హత్యాచారాలకు పాల్పడిన నేరస్తులను కొన్ని సందర్భాలలో ఎన్కౌంటర్లు చేసి పోలీసులు చంపేశారు. అయినా నేరాలు ఎక్కడా నియంత్రించబడలేదు. నేరాన్ని అంతమొందించకుండా నేరస్తులను అంతమొందించే చర్యలకు పాల్పడితే సమస్య పరిష్కారం కాదు అని వారు అన్నారు.
ప్రభుత్వం,పోలీస్ అధికారుల వైఫల్యం మూలంగా మత్తు పదార్థాల అక్రమ విక్రయదారులపై సరైన నిఘా లేకపోవడం వల్ల పట్టణాల నుండి గ్రామాలను మత్తు పదార్థాలు కబలిస్తున్నాయి. దీనితో పాఠశాలలు, కళాశాలలలో చదివే విద్యార్థులకు విక్రయదారుల ద్వారా మత్తు పదార్థాలు అందుతున్నాయి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
అంతే కాదు బస్టాండ్, రైల్వేస్టేషన్లు,సినిమా హాల్స్, బస్తీలలో మత్తు పదార్థాల విక్రయం జోరుగా సాగడంతో కొందరు విద్యార్థి యువకులు వాటికి అలవాటై వారి జీవితాలను చిధ్రం చేసుకుంటున్నారని అన్నారు. మత్తు పదార్థాలను నియంత్రించాల్సిన పోలీస్ శాఖ కండ్లు కప్పి మత్తు పదార్థాల విక్రయదారులు జోరుగా మార్కెట్లోకి ప్రవేశిస్తుంటే పోలీసు యంత్రాంగం నియంత్రించకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
ఇప్పటికైనా మత్తు పదార్థాల సరఫరా, అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు, మత్తుకు గురైన యువతకు చికిత్స, కౌన్సెలింగ్, పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. యువతను మత్తు నుంచి దూరం చేసి విద్య, ఉపాధి, క్రీడలు, విజ్ఞానం, సామాజిక చైతన్యం వైపు నడిపించడమే ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి మార్గం.” అని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో పి వై ఎల్ డివిజన్ నాయకులు గంగావత్ జగదాస్, గంగావత్ సుందర్, బయ్య వెంకన్న, కోడి కృష్ణ,చందావత్ లక్ష్మణ్, అరుణోదయ జిల్లా అధ్యక్షులు బుర్ర రాఘవులు, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ మాణిక్యారం ప్రాంతీయ కమిటీ కార్యదర్శి బండారి సత్యం, సిపిఎంఎల్ మాస్ లైన్ ఇల్లెందు మండల నాయకులు ఇస్లావత్ కోటేష్, స్వర్ణపాక ధర్మయ్య, అరుణోదయ జిల్లా నాయకులు భూక్య పాషా, గంగావత్ పిక్న, PYL గ్రామ కార్యదర్శి జాటోత్ బిక్క, అజ్మీర శంకర్ ,అజ్మీర వీరు,అజ్మీర బద్రు,వాంకుడోత్ రవి, ఏఐయుకేఎస్ డివిజన్ నాయకులు గుగులోతు భద్రు, గంగావత్ లక్యా, బానోత్ వశ్య,భూక్య అమృ తదిరులు పాల్గొన్నారు.




