Khammam: న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్ మృతి పట్ల పువ్వాడ అజయ్ సంతాపం!
Khammam: ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్ అకాల మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సంతాపం. మమతా ఆస్పత్రికి, కుటుంబానికి తీరని లోటని తీవ్ర భావోద్వేగం.
Khammam: న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్ మృతి పట్ల పువ్వాడ అజయ్ సంతాపం!
Khammam: ప్రముఖ న్యూరోసర్జన్ డాక్టర్ జగదీష్ అకాల మరణం పట్ల మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తీవ్ర దిగ్భ్రాంతి, సంతాపం వ్యక్తం చేశారు.డాక్టర్ జగదీష్ మరణం పర్సనల్గా తనకు,మమతా వైద్య విద్యా సంస్థలకు మరియు ఖమ్మం జిల్లా ప్రజలకు తీరని నష్టమని ఆవేదన వ్యక్తం చేశారు.2012వ సంవత్సరంలో మమత నందు చేరి అతి తక్కువ కాలంలోనే ఇక్కడి సిబ్బందికి, విద్యార్థులకు, రోగులకు మరియు ప్రజలందరికీ ఆయన ఎంతో ఆప్తుడిగా మారారని గుర్తు చేసుకున్నారు.
రోగుల పట్ల ఆయనకున్న ఆర్తి, వైద్యం పట్ల ఉన్న అంకిత భావం మరియు కమిట్మెంట్ ప్రశంసనీయమని కొనియాడారు.మమతా ఆసుపత్రిలో న్యూరోసర్జరీ విభాగాన్ని బలోపేతం చేయడంలోనూ,ఉచితంగా పేదలకు వైద్యసేవలు అందించడంలోనూ ఆయన పాత్ర మరవలేనిదని అన్నారు. అలాగే ఖమ్మంలో ఐఎంఏ (IMA) సెక్రటరీగా, ప్రెసిడెంట్గా వైద్య రంగానికి అందించిన సేవలను ఖమ్మం ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారని తెలిపారు.
జగదీష్ తనకు తమ్ముడి లాంటివాడని, ఏ చిన్న గుర్తింపు లభించినా ఎంతో సంతోషంగా వచ్చి నన్ను కలిసి పంచుకునేవాడని, తన చివరి శ్వాస వరకు మమతలోనే ఉంటానని చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. నిన్నటి వరకు ఎంతో సరదాగా గడిపిన జగదీష్ ఈరోజు మన మధ్య లేకపోవడం జీర్ణించుకోలేకపోతున్నామని, చిన్న వయస్సులోనే ఆయన దేవుడి వద్దకు వెళ్ళిపోవడం బాధాకరమని అన్నారు.ఒంగోలు నుండి వచ్చిన ఆయన భార్య పిల్లలకు మరియు కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.భగవంతుడు ఆయన ఆత్మకు శాంతి చేకూర్చాలని దేవుణ్ణి ప్రార్థించారు.




