Khammam: పరిపాలనను గాలికి వదిలేశారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

Khammam: అబద్ధాలు, విద్వేషాలతో సీఎం రేవంత్ పరిపాలనను గాలికి వదిలేశారని, కేసీఆర్, కేటీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ మండిపడ్డారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam
Published on: 30 Sept 2026 11:00 PM IST
Khammam
X

Khammam: పరిపాలనను గాలికి వదిలేశారు మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్

ఖమ్మం: సిరిసిల్ల సభలో కేసీఆర్, కేటీఆర్ లపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

అబద్ధాలు, విద్వేషాలు, దూషణలతో కాలక్షేపం చేస్తూ రాష్ట్రంలో పరిపాలనను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాలికి వదిలేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆవేశానికి లోనై ఆక్రోశంతో సిరిసిల్ల సభలో కేసీఆర్, కేటీఆర్‌పై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తూ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు.

బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గౌరవం, సంస్కారం పాటిస్తూ ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన అవసరం ఉందని కానీ అందుకు భిన్నంగా వ్యక్తిగత విమర్శలు, అసభ్య పదజాలంతో రేవంత్ రెడ్డి మాట్లాడటం బాధ్యతారాహిత్యమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ విమర్శించారు.

ప్రజా సమస్యలపై సమాధానం చెప్పాల్సిన సమయంలో బీఆర్ఎస్ ముఖ్యనేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్తూ, పరిపాలనలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం సిరిసిల్ల సభలో రేవంత్ రెడ్డి చేశారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

Manukonda Kiran, Staff Reporter -Khammam

Manukonda Kiran, Staff Reporter -Khammam

గత 11 ఏళ్లుగా ప్రజా సమస్యలే ఎజెండాగా, విశ్వసనీయమైన గ్రౌండ్ రిపోర్టింగ్ మరియు లోతైన కథనాలను అందిస్తున్న ‘స్టాఫ్ రిపోర్టర్’.