Kothagudem: నాటుసారా తయారీపై ఎక్సైజ్ దాడులు.. పానకం నిల్వలు స్వాధీనం!

Kothagudem: కరకగూడెం మండలంలో ఎక్సైజ్ అధికారుల సంయుక్త దాడులు. 800 లీటర్ల బెల్లం పానకాన్ని స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేసిన అధికారులు.

A CHANDRA SHEKAR, PINAPAKA
Published on: 10 Oct 2026 5:38 PM IST
Kothagudem
X

Kothagudem: నాటుసారా తయారీపై ఎక్సైజ్ దాడులు.. పానకం నిల్వలు స్వాధీనం!

Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం, కలవలనాగారం గ్రామంలో మణుగూరు ఎక్సైజ్ స్టేషన్, ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ మరియు కొత్తగూడెం డీటీఎఫ్ బృందాలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయని మణుగూరు ఎక్సైజ్ సీఐ నాగేశ్వరరావు గారు తెలిపారు.

ఈ సందర్భంగా అక్రమంగా పులియపెట్టిన 800 లీటర్ల బెల్లం పానకాన్ని గుర్తించి, స్వాధీనం చేసుకుని అక్కడికక్కడే ధ్వంసం చేశారు.

అక్రమంగా పులియపెట్టిన బెల్లం పానకాన్ని తయారు చేయడం, నిల్వ చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు. అక్రమ మద్యం తయారీపై నిరంతరం నిఘా కొనసాగిస్తూ, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ దాడుల్లో మణుగూరు ఎస్సై విజయభాస్కర్ ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ ఎస్సై శ్రీవారి రావు మరియు కొత్తగూడెం డీటీఎఫ్ ఎస్సై సమీవుల్లా ఖాన్,సిబ్బంది నాగరాజు, శ్రీనివాస్, వీరబాబు‌,నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు : ఎక్సైజ్‌ సీఐ నాగేశ్వరరావు

నాటుసారాయి తయారీ, రవాణా, విక్రయాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని మరియు నాటుసారా తయారీ కి అవసరమయ్యే ముడి సరకలు అమ్మేవారిపైనా ఉక్కపాదం మోపుతామని హెచ్చరించారు.

A CHANDRA SHEKAR, PINAPAKA

A CHANDRA SHEKAR, PINAPAKA