Kothagudem: చండ్రుగొండ మండలంలో విస్తృతంగా గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు!

Kothagudem: అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశాలతో చండ్రుగొండ మండలం పోకలగూడెం, వెంకట్యతండా గ్రామాల్లో కాంగ్రెస్ నేతలు పట్టభద్రుల (MLC) ఓటర్ నమోదు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 25 Oct 2026 7:21 AM IST
Kothagudem
X

Kothagudem: చండ్రుగొండ మండలంలో విస్తృతంగా గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు!

Kothagudem: అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారి ఆదేశాలతో చండ్రుగొండ మండలం పోకలగూడెం, వెంకట్యతండా ఉమ్మడి పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నాయకులు విస్తృతంగా MLC గ్రాడ్యుయేట్ ఓటర్ నమోదు కార్యక్రమం చేపట్టారు.

ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రామిరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారి గెలుపు కొరకు పార్టీ కోసం స్వచ్ఛందంగా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తు ఫామ్ లను అందజేశారు.

ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారి అభిమాని ఆధ్వర్యంలో చండ్రుగొండ మండలంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమంలో భాగంగా ఫాం-18 దరఖాస్తు ఫామ్ లను గ్రామ గ్రామాన తిరిగి గ్రాడ్యుయేట్ యువతకు అందజేస్తూ ఓటు నమోదుపై అవగాహన కల్పిస్తున్నారు.

ఒక్కరోజే ఉమ్మడి పంచాయతీలో సుమారు 100 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లను కలవడం జరిగిందని, అందుబాటులో లేని వారికి చరవాణి ద్వారా తమ తమ ఓటును నమోదు చేసుకోవాలని నాయకులు తెలిపారు.

ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ తమ ఓటును నమోదు చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిరిజన GLSJAC భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కో చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుగులోత్ శ్రీనివాస్ నాయక్, ఉమ్మడి పంచాయతీల కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్యతండా గ్రామ శాఖ అధ్యక్షులు గుగులోత్ హరిలాల్ నాయక్,

మాలోత్ లక్ష్మణ్ నాయక్, ఇస్లావత్ సాయిరాం నాయక్, గుగులోత్ రాములు నాయక్, బానోత్ దేవా నాయక్, బానోత్ బాబూలాల్ నాయక్, సవలం బాబు, రవీందర్, అఖిల్ నాయక్, జి. రమేష్ నాయక్, లకావత్ మోహన్ నాయక్, ధరావత్ శంకర్ నాయక్, ఇస్లావత్ తారచంద్ నాయక్, బాలాజీ నాయక్, బిక్షాలు, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్