Khammam: పువ్వాడ ఉదయ్ నగర్‌లో నార్కోటిక్ జాగిలాలతో పోలీసుల తనిఖీలు
Khammam: ఖమ్మం సీపీ సునీల్ దత్ ఆదేశాలతో పువ్వాడ ఉదయ్ నగర్‌లో రఘునాథపాలెం ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఆధ్వర్యంలో నార్కోటిక్ జాగిలాలతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.
Khammam: పువ్వాడ ఉదయ్ నగర్‌లో నార్కోటిక్ జాగిలాలతో పోలీసుల తనిఖీలు
Khammam: పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని వివిధ దుకాణాలలో గంజాయిని చాక్లెట్లు, సిగరెట్, పౌడర్ రూపంలో విక్రయిస్తున్నారని సమాచారం మేరకు రఘునాథపాలెం ఇన్స్పెక్టర్ కరుణాకర్ ఆధ్వర్యంలో పువ్వాడ ఉదయ్ నగర్ పరిసరాలలో పాడుబడ్డ బంగ్లాలు, నిర్మానుష ప్రాంతాలు, పార్కులు, కిరాణా దుకాణాలు, పాన్‌డబ్బాలలో తనిఖీలు ముమ్మరం చేశారు.
గంజాయి హాట్‌స్పాట్‌లపై ప్రత్యేక దృష్టి సారించి, పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు ముసుగులో జరుగుతున్న అక్రమ అమ్మకాలను పోలీసులు పసిగట్టి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ తో పరిసర ప్రాంతాలలో, ప్రాంగణానికి సమీపంలోని దుకాణాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి, చట్టవిరుద్ధమైన మాదక ద్రవ్యాల ఆనవాళ్లను గుర్తించేలా తనిఖీలు చేపట్టారు.




