Bhadradri Kothagudem: సమితి సింగారంలో ‘వీబీ-జీ రామ్ జీ’ ఫారం పాండ్ పనుల పరిశీలన!
Bhadradri Kothagudem: మణుగూరు మండలం సమితి సింగారంలో వీబీ-జీ రామ్ జీ పథకం కింద జరుగుతున్న ఫారం పాండ్ పనులను ఎంపీడీవో ఎం. శ్రీకాంత్, సర్పంచ్ కలబోయిన మాధవరావు పరిశీలించారు.
Bhadradri Kothagudem: సమితి సింగారంలో ‘వీబీ-జీ రామ్ జీ’ ఫారం పాండ్ పనుల పరిశీలన!
Bhadradri Kothagudem: మణుగూరు మండలం,సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో వీబీ -జీ రామ్ జీ ( వికసిత్ భారత్ గ్రామీణ ఉపాధి మరియు జీవనోపాధి హామీ) పథకం కింద ఫారం పాండ్,(పంట పొలాల్లో ఇంకుడు గుంత) పనుల పరిశీలించిన.ఎంపీడీవో ఎం శ్రీకాంత్, సర్పంచ్ కలబోయిన మాధవరావు, ఉప సర్పంచ్ గాండ్ల సురేష్.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు.రాష్ట్ర ప్రభుత్వం ఎలి నీనో ప్రభావం వల్ల గ్రామాలలో ఉపాధి పెంచటానికి వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా వ్యవసాయ మరియు ఇతర కూలీలకు ఉపాధిని కల్పించడం జరుగుతుందని, దానిలో భాగంగా జరుగుతున్న పనులను పరిశీలించడం అయినదని అన్నారు. అలాగే పని ప్రదేశంలో ఉపాధి కూలీలకు అన్ని సౌకర్యాలను సమకూర్చడం జరిగిందని తెలియజేసినారు.
సమితి సింగారం గ్రామపంచాయతీ పరిధిలో గల ఉపాధి జాబ్ కార్డు ఉన్నవారు వీబీ జీ రామ్ జీ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవాలని అన్నారు.ఉపాధి కార్డు లేనివారు గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించి నూతన ఉపాధి జాబ్ కార్డును పొందగలరన్నారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జక్కుల అశోక్ కుమార్, ఈసీ సందీప్, టి ఏ దశరథం, మేటు పావని మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.




