Burgampahad: లారీల కొరతతో నిలిచిన ధాన్యం సేకరణ.. బూర్గంపహాడ్ లో ఉద్రిక్తత!

Burgampahad: బూర్గంపహాడ్ PACS అధికారుల నిర్లక్ష్యంపై రైతుల ఆగ్రహం. లారీల కొరతతో నిలిచిపోయిన ధాన్యం తరలింపు.

G Ravi, Bhadradri
Published on: 13 May 2026 4:58 PM IST
Burgampahad
X

Burgampahad: లారీల కొరతతో నిలిచిన ధాన్యం సేకరణ.. బూర్గంపహాడ్ లో ఉద్రిక్తత!

బూర్గంపహాడ్: బూర్గంపహాడ్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారుల నిర్లక్ష్య వైఖరిపై రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటూ వర్ష సూచన ఉన్నా, కొనుగోలు కేంద్రాల్లో పేరుకుపోయిన ధాన్యం బస్తాలను సకాలంలో తరలించకపోవడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. రోజుల తరబడి ధాన్యం బస్తాలు ఆరుబయటే ఉండిపోవడంతో తేమ పట్టి నాణ్యత దెబ్బతినే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాకుండా లారీల ఏర్పాటు మొక్కుబడిగా ఉండటం, లారీల కొరతతో ధాన్యం తరలింపు నిలిచిపోవడంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని, తమ గోడు పట్టించుకునేవారే లేరని రైతులు ఆరోపిస్తున్నారు.

“కష్టపడి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా రాకుండా, ఇప్పుడు తడిసిపోయే పరిస్థితి వచ్చింది. ఇది రైతులను నట్టేట ముంచడమే” అని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేసి, తగినన్ని లారీలు ఏర్పాటు చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని రైతులు PACS అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story