Yellandu: దేశవ్యాప్త రైతు నేతలంతా ఒక్కటే.. ఇల్లందులో భారీ ప్రదర్శన!

Yellandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) జాతీయ మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

SHOBAN BABU, YELLANDU
Published on: 12 May 2026 10:34 AM IST
Yellandu
X

Yellandu: దేశవ్యాప్త రైతు నేతలంతా ఒక్కటే.. ఇల్లందులో భారీ ప్రదర్శన!

ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో అఖిల భారత ఐక్య రైతు సంఘం (ఏఐయుకేఎస్) జాతీయ మహాసభలు సందడిగా ప్రారంభమయ్యాయి.. 11, 12, 13 తేదీలలో ఇల్లందులో మూడు రోజులపాటు జరగనున్న మహాసభలలో సోమవారం ఇల్లందు పట్టణంలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మందితో భారీ ప్రదర్శన బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలకు పంజాబ్, బెంగాల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, అస్సాం, త్రిపుర, ఢిల్లీ, హర్యానా,రాష్ట్రాల నుండి ప్రతినిధులు హాజరయ్యారు. ప్రజా కళాకారులు ఆదివాసి నృత్యాలు ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచాయి.

అనంతరం నిర్వహించిన బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా రైతు సంఘం అఖిల భారత నాయకులు ప్రదీప్ సింగ్ ఠాగూర్,సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ప్రారంభ ఉపన్యాసం చేయగా. కెచ్చల రంగయ్య,విమల్ త్రివేది, కృష్ణ గోగై, ఏఐయుకేఎస్ అఖిలభారత కన్వీనర్లు నాయకత్వం వహించి ప్రసంగించారు. సిపిఐ ఎంఎల్ ప్రజాబంద రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ.. పాలకుల పేరుతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటుందన్నారు.

ఏఐయుకేఎస్ జాతీయ నాయకులు ప్రదీప్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ...రైతాంగం నిర్వహించే క్రియాశీల పోరాటాలే రైతుల సమస్యలు పరిష్కరిస్తాయి అన్నారు. కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇటీవల పలు రాష్ట్రాల్లో సాధించిన విజయాలతో రైతు వ్యతిరేక చట్టాలను హరించే చర్యలు చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో పలు పేర్లతో ఉన్న రైతు సంఘాలు అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల సంక్షేమం కోసం పోరాటాలు చేస్తుందన్నారు. దేశంలో పెరిగిపోతున్న దేశ విదేశీ కార్పొరేట్ శక్తులను అడ్డుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

SHOBAN BABU, YELLANDU

SHOBAN BABU, YELLANDU

Next Story