Bhadradri Kothagudem: కటింగ్ పేరుతో దోపిడీ.. భద్రాద్రిలో రైతుల నిరసన గళం

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ధాన్యం కొనుగోళ్లలో దళారుల దోపిడీని నిరసిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు.

G Ravi, Bhadradri
Published on: 24 April 2026 12:03 PM IST
Bhadradri Kothagudem
X

Bhadradri Kothagudem: కటింగ్ పేరుతో దోపిడీ.. భద్రాద్రిలో రైతుల నిరసన గళం

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. బూర్గంపాడు రైతు వేదిక ముందు ధాన్యం కొనుగోలు చేయాలి అని ఆందోళన. అగ్రికల్చర్ అధికారిని,PACS అధికారులను ను రైతు వేదిక లో పెట్టి తలుపులేసిన రైతులు. ధాన్యం కొనుగోళ్లు చేయకపోతే పురుగుల మందు తాగుతాము అంటున్న రైతులు. ధాన్యం క్వాలిటీ అంటూ గ్లాసుల్లో ధాన్యం తీసుకున్న అగ్రికల్చర్ అధికారి పై తిరగబడ్డ రైతులు. ప్రభుత్వ సొసైటీలు ద్వారా క్వింటాకు రూ.2000 చొప్పున ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉండగా, యార్డుల్లో మాత్రం మధ్యదళారులే ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కేవలం రూ.1400కే ధాన్యం కొనుగోలు చేస్తూ, రూ.600 వరకు “కటింగ్” పేరుతో రైతులను నేరుగా దోచుకుంటున్నారని రైతులు మండిపడుతున్నారు. మార్కెట్ యార్డుల్లో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని, మధ్యదళారులు బహిరంగంగానే తిరుగుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రైతులు మరియు అధికారుల మధ్య కొద్దిసేపు తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

G Ravi, Bhadradri

G Ravi, Bhadradri

Next Story